పై ఫొటోలో పెట్ డాగ్ తో కలిసి పోజులిస్తోన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఈ చిన్నారి ఓ హ్యాండ్సమ్ విలన్ కూతురు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ కూడా. తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. అనతికాలంలోనే క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. లవ్, డేటింగ్, రిలేషన్ షిప్ విషయాల్లోనూ ఈ హీరోయిన్ పేరు తరచుగా వినిపిస్తుంది. ఇటీవలే ఓ స్టార్ హీరోతో ఆమెకు బ్రేకప్ జరిగిందని ప్రచారం జరిగింది. ఇంతలోనే ఓ స్టార్ క్రికెటర్ తో ఆమె డేటింగ్ చేస్తోందని పుకార్లు వినిపించాయి. పేరుకు బాలీవుడ్ నటి అయినా ఈ ముద్దుగుమ్మ తెలుగు వారికి కూడా పరిచయమే. విజయ్ దేవరకొండ- పూరి జగన్నాత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఓ పాన్ ఇండియా సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటన్నామో? యస్. ఈ క్యూటీ మరెవరో కాదు లైగర్ హీరోయిన్ అనన్యా పాండే.
సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే నటీమణుల్లో అనన్యా పాండే ఒకరు. తాజాగా ఆమె ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. చిన్నప్పటి నుంచి తన తోడుగా ఉన్న పెట్ డాగ్ చనిపోవంతో తన ఆవేదనను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. 2008 నుంచి ఫడ్జ్ అనే పెంపుడు కుక్క అనన్య పాండే ఇంట్లో ఉంది. ఇప్పుడు అది చనిపోయింది. ఈ సందర్భంగా ఫడ్జ్ తో తనకున్న మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కొన్ని ఫొటోలను అందులో పంచుకుంది. ప్రతిరోజూ నిన్ను మిస్ అవుతా అని కాస్త ఎమోషనల్ అయింది. ఫై ఫొటో అందులోదే.
ఇక అనన్యా పాండే తండ్రి చుంకీ పాండే కూడా ప్రముఖ నటుడే. బాలీవుడ్ లో ఎప్పటినుంచో విలన్ గా నటిస్తున్నాడు. ప్రభాస్ నటించిన ‘సాహో’ మూవీలో కూడా స్టైలిష్ విలన్ గా మెప్పించాడు. ఇక అనన్యా పాండే నటించిన ‘కాల్ మీ బే’ సినిమా సెప్టెంబరు 6న నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.