Tollywood: ఆమె ముంగురులని తాకాలని గాలికెంత ఆరాటమో.. ఇలా అయితే ప్రపంచమే ఆగిపోతుంది సుమీ.. ఎవరో గుర్తుపట్టండి..

|

Nov 20, 2022 | 8:18 PM

చిరునవ్వుతోనే కుర్రాళ్లను మయ చేసే ఈ వయ్యారీ తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. తన నటనతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Tollywood: ఆమె ముంగురులని తాకాలని గాలికెంత ఆరాటమో.. ఇలా అయితే ప్రపంచమే ఆగిపోతుంది సుమీ.. ఎవరో గుర్తుపట్టండి..
Actress
Follow us on

తెల్లారిపోతున్న విడిపోని రాత్రేది.. వాసనలు వీచే నీ కురులె సఖీ.. లోకాన చీకటైనా వెలుగున్న చోటేదీ.. సూరీడు మెచ్చే నీ కన్నులె చెలీ..అంటూ సాంగ్ గుర్తొస్తుంది కదా ఆ ఫోటో చూస్తుంటే. ఆమె ముంగురులని తాకాలని గాలికెంత ఆరాటమో అనట్టుగా ఉంది ఆ పిక్. అమాయకపు చూపులతో.. పరధ్యానంగా చూస్తున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టండి. ఈ అమ్మడును చూస్తే అందం కూడా అసూయ పడుతుందేమో.

చిరునవ్వుతోనే కుర్రాళ్లను మయ చేసే ఈ వయ్యారీ తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. తన నటనతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎవరో గుర్తుపట్టంది. ఈరోజు ఈ అందాల చిన్నదాని పుట్టినరోజు. ప్రస్తుతం ఈ వయ్యారీ లేటేస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఆ సుకుమారీ మరెవరో కాదు.. తమిళ్ బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్. 1994 నవంబర్ 20న చెన్నైలో పుట్టిన ప్రియాంక.. థియేటర్ ఆర్ట్స్ పూర్తిచేసింది. న్యాచురల్ స్టార్ నాని సరసన గ్యాంగ్ లీడర్ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత శ్రీకారం.. వరుణ్ డాక్టర్, డాన్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న రావణాసుర చిత్రంలో కనిపించనుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.