Tollywood: టాలీవుడ్ హీరోయిన్.. ఒక్క సినిమాతోనే ఫేమస్ అయ్యింది..  ఎవరో గుర్తుపట్టగలరా ?..

|

Oct 28, 2023 | 2:12 PM

తమ అభిమాన తారల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎక్కువగానే ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ చిన్నారి పిక్ నెట్టింట హల్చల్ చేస్తుంది. పైన ఫోటోను చూశారు కదా. ఆ క్యూట్ చిన్నారి టాలీవుడ్ హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినా.. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఎవరో గుర్తుపట్టారా ?.. ఇటీవలే అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరింది. త్వరలోనే మరింత ధృడంగా తిరిగి వస్తానంటూ ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటోను షేర్ చేసింది.

Tollywood: టాలీవుడ్ హీరోయిన్.. ఒక్క సినిమాతోనే ఫేమస్ అయ్యింది..  ఎవరో గుర్తుపట్టగలరా ?..
Actress
Follow us on

సోషల్ మీడియాలో నిత్యం సినీతారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల తారల రేర్ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. అలాగే తమ అభిమాన తారల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎక్కువగానే ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ చిన్నారి పిక్ నెట్టింట హల్చల్ చేస్తుంది. పైన ఫోటోను చూశారు కదా. ఆ క్యూట్ చిన్నారి టాలీవుడ్ హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినా.. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఎవరో గుర్తుపట్టారా ?.. ఇటీవలే అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరింది. త్వరలోనే మరింత ధృడంగా తిరిగి వస్తానంటూ ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటోను షేర్ చేసింది. తనే హీరోయిన్ సునైనా. తెలుగుతోపాటు.. తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో ఒక్క సినిమాతోనే ఫేమస్ అయ్యింది. కానీ ఆ తర్వాత అంతగా అవకాశాలు అందుకోలేదు.

సునైనా అసలు పేరు సునైనా యెల్లా.. 1989 ఏప్రిల్ 18న మహారాష్ట్రలోని నాగపూర్ ప్రాంతంలో జన్మించింది. 2005లో కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా అంతగా జనాలకు కనెక్ట్ కాలేదు. ఆ తర్వాత తెలుగులోనే సమ్ థింగ్ స్పెషల్, 10th క్లాస్ సినిమాల్లో నటించింది. ఈ మూవీస్ కూడా సునైనాకు అంతగా పేరు తీసుకురాలేకపోయాయి.

కానీ యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన రాజ రాజ చోర సినిమాతో ఈ బ్యూటీకి ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ఇందులో ఢీగ్లామర్ రోల్లో కనిపించిన తన నటనతో ఆకట్టుకుంది. సునైనా చివరిసారిగా లాఠీ చిత్రంలో నటించింది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం సునైనా చిన్ననాటి ఫోటో నెట్టింట వైరలవుతుంది. కన్నడలో కాదలిల్ విడుంతేన్ సినిమాలో నటించిన సునైనా.. ఆ తర్వాత తమిళ్ బిగ్ బాస్ 4 సీజన్లో పాల్గొంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.