ఒకప్పుడు యాంకర్.. ఇప్పుడు కిరాక్ బ్యూటీ.. ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా.?

|

Oct 07, 2024 | 1:11 PM

అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించి వరుస ఆఫర్స్ అందుకుంటున్నారు కొంతమంది ముద్దుగుమ్మలు. వీరిలో సినిమా పై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినవారు ఉన్నారు. అలాగే అనుకోకుండా సినిమాల్లోకి వచ్చిన వారు కూడా ఉన్నారు. అలాగే పై ఫోటోలో కనిపిస్తున్న యువతి మాత్రం ఒకప్పుడు న్యూస్ రీడర్.

ఒకప్పుడు యాంకర్.. ఇప్పుడు కిరాక్ బ్యూటీ.. ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా.?
Actress
Follow us on

టాలీవుడ్ లో చాలా మంది ఇతరభాషల నుంచి వచ్చిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఇతర బాషల నుంచి వచ్చినప్పటికీ తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించి వరుస ఆఫర్స్ అందుకుంటున్నారు కొంతమంది ముద్దుగుమ్మలు. వీరిలో సినిమా పై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినవారు ఉన్నారు. అలాగే అనుకోకుండా సినిమాల్లోకి వచ్చిన వారు కూడా ఉన్నారు. అలాగే పై ఫోటోలో కనిపిస్తున్న యువతి మాత్రం ఒకప్పుడు న్యూస్ రీడర్. ఓ ప్రముఖ ఛానల్లో న్యూస్ రీడర్‏గా పనిచేసింది. అలాగే యాంకరింగ్ కూడా చేసింది. ఆతర్వాత హీరోయిన్ గా మారింది.  నటిగా కెరీర్ మొదలుపెట్టకముందే బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా మరి అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. తన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటుంది. ఇప్పటివరకు ఆ ముద్దుగుమ్మ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో రాణిస్తున్న ఈ హీరోయిన్ మరెవరో కాదండి..

ఆమె మరెవరో కాదు కోలీవుడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్. 1989లో తమిళనాడులో జన్మించింది ప్రియా భవానీ శంకర్. మొదట్లో న్యూస్ ప్రజెంటర్ గా పనిచేసింది. పుతియ తలైమురైలో పని చేసింది ఈ అమ్మడు. ఆ తర్వాత బుల్లితెరపై పలు సీరియల్లలో నటించింది. కళ్యాణ్ ముదల్ కాదల్ వరై సీరియల్లో మెయిన్ రోల్ పోషించింది. ఇక ఆ తర్వాత వైభవ్ రెడ్డి హీరోగా వచ్చిన మేయదా మాన్ అనే సినిమాతో కథానాయికగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈసినిమాకు ఉత్తమ నూతన నటిగా సైమా అవార్డ్ అందుకుంది.

ఈ సినిమా తర్వాత కోలీవుడ్ స్టార్ కార్తీ నటించిన కడై కుట్టి సింగం ( తెలుగులోచినబాబు) సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఎస్ జే సూర్య జోడిగా మాన్ స్టర్ చిత్రంలో మెప్పించింది. ఇవే కాకుండా ఓ మన్నేపిన్నే, బ్లడ్ మనీ, హాస్టల్, యానాయ్ వంటి చిత్రాల్లో నటించింది. తమిళంలో వరుస సినిమాల్లో నటించిన ప్రియా.. తిరు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ధనుష్ నటించిన ఈ మూవీలో ముఖ్య పాత్ర పోషించింది. యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన కళ్యాణం కమనీయం సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత నాగచైతన్య నటించిన ధూత వెబ్ సిరీస్ లో నటించింది. ఇటీవలే గోపిచంద్ జోడిగా భీమా సినిమాలో మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో మరిన్ని ఆఫర్స్  వస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.