Tollywood: ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. 42 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు పోటీ.. తల్లైనా తరగని అందం..
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకీ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన ఆమె.. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో అలరిస్తుంది. ఎప్పుడూ నెట్టింట సందడి చేసే ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ?
సోషల్ మీడియా ప్రపంచంలో ఇప్పుడు ప్రతి చిన్న విషయం క్షణాల్లో వైరలవుతుంది. ఇంకా సెలబ్రెటీస్ విషయాల గురించి చెప్పక్కర్లేదు. నిత్యం సినిమా అప్డేట్స్.. లేదా పర్సనల్ విషయాల గురించి ఏదోక న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల కాలంలో సినీ ప్రముఖుల చిన్ననాటి ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి టాలీవుడ్ స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే స్పెషల్ సాంగ్స్ తో అలరించింది. ప్రస్తుతం ఆ హీరోయిన్ వయసు 42 సంవత్సరాలు. అయినా ఏమాత్రం తరగని అందంతో కుర్రహీరోయిన్లకు పోటి ఇస్తుంది. ఇంతకీ ఆ చిన్నారిని గుర్తుపట్టరా.. ? మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించి తెలుగులో టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరంటే.. తనే హీరోయిన్ శ్రేయా శరణ్.
శ్రేయా శరణ్.. 1981లో భారతదేశంలోని డెహ్రాడూన్‌లో జన్మించింది. చిన్నప్పుడే కథాకళి, రాజస్తానీ నృత్యం నేర్చుకుంది. సినిమాల్లోకి రాకముందు కాలేజీలో చదువుతున్నప్పుడే షార్ట్ ఫిల్మ్‌లలో నటించి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత 2001లో విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఇష్టం సినిమాతో తెలుగు సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో వరుసగా అగ్ర కథానాయకుల చిత్రాల్లో నటిస్తూ అభిమానుల ఆదరణ పొందింది. తెలుగులో యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు అందరి సరసన నటించింది. 2003లో జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన మీకు 20 తుంకు 18 చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలో నటిగా రంగప్రవేశం చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి చిన్నప్పటి దళపతి విజయ్, విక్రమ్, ధనుష్, విశాల్, జయం రవి అందరూ హీరోలతో కలిసి నటించింది.
ఆ తర్వాత 2018లో రష్యాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆండ్రీ కోషెవ్‌ను వివాహం చేసుకుంది. వీరికి రాధ అనే కూతురు ఉంది. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం తగ్గించుకున్న ఆమె ఇప్పుడు పూర్తిగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆమె తాజా ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
ఇది చదవండి : Mathu Vadalara 2 Riya: హే.. రియా నువ్వు ఆ షార్ట్ ఫిల్మ్ చేశావా.. ? ఆ ఒక్క వీడియోతో ఫేమస్ చేసిందిగా..
Prema Kavali : వారెవ్వా.. ఏం మారింది భయ్యా.. నెట్టింట గత్తరలేపుతోన్న ప్రేమ కావాలి హీరోయిన్..
Aadi Movie: ఆది సినిమాలో ఈ నటి గుర్తుందా.. ? ఇప్పటికే అదే అందంతో మెస్మరైజ్ చేస్తోందిగా..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.