కొంతమంది మంది హీరోయిన్స్ సినిమాలకోసం చాలా కష్టపడుతూ ఉంటారు. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు. చాలా మంది హీరోయిన్స్ గ్లామర్ రోల్స్ కే పరిమితం అవుతున్నారు. కానీ కొంతమంది మాత్రం ఇలా విభిన్నమైన కథలను, పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. ఇంతకూ పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది. అంతే కాదు ఆమె ఓ కేంద్ర మంత్రి భార్య కూడా..? ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టరా.? తెలుగుతో పాటు కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ చిన్నది.
ఆమె పేరు రాధిక కుమారస్వామి. కేంద్రమంత్రి కుమార స్వామి భార్య ఆమె. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రాధికా.. హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించింది ఈ ముద్దుగుమ్మ. రాధికా చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చింది. తొలి సినిమా చేసే సమయంలో ఆమె 9వ తరగతి చదువుతుంది.
కన్నడ బాషాలో వరుసగా సినిమాలు చేసిన ఆమె తెలుగులో దివంగత నటుడు నందమూరి తారక రత్న నటించిన భద్రాద్రి రాముడు సినిమాలో నటించింది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది రాధిక. 2018 వరకు సినిమాలు చేసిన ఆమె ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కుమార స్వామిని ఆమె రెండో పెళ్లి చేసింది. అంతకు ముందే కుమార స్వామికి పెళ్లైంది. పెళ్లి తర్వాత నటనకు దూరం అయ్యింది. కానీ నిర్మాతగా సినిమాలు చేసింది. నిర్మాతగా మారి సినిమాలు కూడా చేశారు. ఇక ఇప్పుడు రాధిక కుమారస్వామి ‘భైరాదేవి’ అనే సినిమాలో నటిస్తుంది. ఆ సినిమాకు సంబందించిన పోస్టరే పై ఫొటోలో ఉంది. ఈ సినిమాకు రాధికానే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈసెంట్ గా ఈ మూవీ ట్రైలర్‌లో రాధిక కుమారస్వామి గెటప్ అందరినీ ఆకట్టుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.