అందం, అభినయమే కాదు.. చక్కటి శరీరాకృతి కూడా కథానాయికలకు ముఖ్యమే. సన్నజాజిలా వయ్యరంగా ఉండాల్సిందే. అందుకే నిద్రలేచినప్పటి నుంచి పడుకునే వరకు తమ ఫిట్ నెస్ పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు హీరోయిన్స్. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ.. యోగా, మెడిటేషన్ చేస్తూ ఫిట్ నెస్ కాపాడుకుంటారు. హీరోయిన్స్ వర్కవుట్ వీడియోస్ నెట్టింట తెగ వైరలవుతుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు పరిశ్రమలోని క్రేజీ హీరోయిన్ యోగా వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందులో ఏకంగా ఆ ముద్దుగుమ్మ తన శరీరాన్ని విల్లులా వంచేసింది. పైన ఫోటోను చూశారు కదా. ఆ అమ్మడు ఎవరో గుర్తుపట్టండి.
తెలుగు చిత్రపరిశ్రమలో ఈ ముద్దగుమ్మ అతి తక్కువ సమయంలోనే స్పెషల్ ఇమేజ్ సంపాదించుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. గుర్తుపట్టండి. ఈ చిన్నది నార్త్ ఇండియన్ కాదు. అచ్చమైన తెలుగమ్మాయి. తెలంగాణలో పుట్టి పెరిగిన ఈ అమ్మడు. మొదటి సినిమాకే ఏకంగా ఉత్తమ నటిగా సైమా అవార్డు కూడా అందుకుంది . ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.
శరీరాన్ని విల్లులా వంచిసిన ఈ చిన్నది మరెవరో కాదు. తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. మల్లేశం సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన అనన్య.. ప్లేబ్యాక్, వకీల్ సాబ్, మ్యాస్ట్రో చిత్రాల్లో నటించింది.ప్రస్తుతం సమంత నటించిన శాకుంతలం సినిమాలో నటించింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులుజరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.