Tollywood: అమ్మాయిల ఫేవరేట్ హీరో.. ఇండస్ట్రీలో చాలా స్పెషల్ ఈ అబ్బాయి.. ఎవరో గుర్తుపట్టగలరా..?

|

Aug 26, 2024 | 11:51 AM

హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న టాప్ హీరోలలో ఒకరు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. బాక్సాఫీస్ వసూళ్లు రాబట్టడమే కాకుండా ఫస్ట్ మూవీతోనే హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అమాయకంగా కనిపిస్తూనే ఎంతో మంది ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఎవరో గుర్తుపట్టండి.

Tollywood: అమ్మాయిల ఫేవరేట్ హీరో.. ఇండస్ట్రీలో చాలా స్పెషల్ ఈ అబ్బాయి.. ఎవరో గుర్తుపట్టగలరా..?
Actor
Follow us on

చాలా రోజులుగా సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం ఇలా భాషతో సంబంధం లేకుండా తమ ఫేవరేట్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్, వీడియోస్ తెగ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన టాప్ హీరోస్ అందరి ఫోటోస్ తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ఇప్పుడు మరో టాలీవుడ్ హీరో చైల్డ్ హుడ్ పిక్ నెట్టింట ఆకట్టుకుంటుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో తండ్రితోపాటు ఎంతో ముద్దుగా కనిపిస్తోన్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టండి. తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచితమైన నటుడు. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న టాప్ హీరోలలో ఒకరు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. బాక్సాఫీస్ వసూళ్లు రాబట్టడమే కాకుండా ఫస్ట్ మూవీతోనే హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అమాయకంగా కనిపిస్తూనే ఎంతో మంది ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఎవరో గుర్తుపట్టండి. అతడే హీరో నితిన్.

హీరో నితిన్ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ క్రేజీ హీరో నితిన్. 1983 మార్చి 30న నిజామాబాద్‏లో జన్మించాడు. నటనపై ఆసక్తితో కాలేజీ రోజుల్లోనే హీరోగా ప్రయత్నాలు స్టార్ట్ చేశాడు. బీటెక్ చదువుతున్న రోజుల్లోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2002లో డైరెక్టర్ తేజ రూపొందించిన జయం సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా సమయంలో నితిన్ బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో నటన పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత దిల్, సంబరం, శ్రీ ఆంజనేయం వంటి చిత్రాలతో మెప్పించాడు.

ఇవి కూడా చదవండి

డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన సై సినిమాతో హీరోగా స్టార్ డమ్ అందుకున్నారు నితిన్. కానీ ఆ తర్వాత ఆ స్థాయిలో బ్రేక్ తెచ్చుకోలేకపోయారు. నితిన్ కెరీర్ లో త్రివిక్రమ్ తెరకెక్కించిన అఆ సినిమా చాలా ప్రత్యేకం. సమంత కథానాయికగా నటించిన ఈ చిత్రానికి అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం నితిన్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ చిత్రంలో నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.