Tollywood: ఈ కుర్రాడి మాటలకు పదునెక్కువ.. ఇండస్ట్రీలో ఓ బ్రాండ్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..

పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తోన్న ఆ కుర్రాడిని గుర్తుపట్టగలరా.ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. అతనికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన మాటలకు పదునెక్కువ.. ఇక ఆయన పేరు కొందరికి మంత్రం. మరికొందరికి ఓ బ్రాండ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయనకంటూ ప్రాణాలిచ్చే్ స్నేహితులు, అభిమానులు ఉన్నారు. గుర్తుపట్టండి.

Tollywood: ఈ కుర్రాడి మాటలకు పదునెక్కువ.. ఇండస్ట్రీలో ఓ బ్రాండ్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
Actor

Updated on: Sep 02, 2023 | 11:54 AM

ప్రస్తుతం సోషల్ మీడియా సెలబ్రెటీలకు.. అభిమానులకు వారధిగా మారింది. ఇప్పుడు నేరుగా తమ ఫేవరెట్ నటీనటులతో ముచ్చటిస్తున్నారు.. సినిమా అప్టేట్స్, వ్యక్తిగత సమాచారం తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక పలువురు స్టార్స్ కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ.. వారు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిస్తుంటారు. ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా సెలబ్రెటీస్ చిన్ననాటి ఫోటోస్ ఎక్కువగా వైరలవుతున్నాయి. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తోన్న ఆ కుర్రాడిని గుర్తుపట్టగలరా.ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. అతనికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన మాటలకు పదునెక్కువ.. ఇక ఆయన పేరు కొందరికి మంత్రం. మరికొందరికి ఓ బ్రాండ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయనకంటూ ప్రాణాలిచ్చే్ స్నేహితులు, అభిమానులు ఉన్నారు. గుర్తుపట్టండి. ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈరోజు ఆయన పుట్టినరోజు.

కొణిదెల కళ్యాణ్ బాబు.. 1971 సెప్టెంబర్ 2న జన్మించారు. మెగాస్టార్ చిరంజీవి సోదరుడు. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత 1998లో నటించి తొలి ప్రేమ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. సుస్వాగతం, ఖుషి, తమ్ముడు, బద్రి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, భీమ్లా నాయక్, బ్రో సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇవి కూడా చదవండి

కళ్యాణ్ బాబును ఆయన అభిమానులు పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు జనాలకు సేవ చేయడానికి రాజకీయంలోకి అడుగుపెట్టారు. 2014లో జనసేన పార్టీ స్థాపించారు. సామాజిక సేవ చేయడంలో దాతృత్వ కార్యక్రమాలు చేయడంలో పవన్ ముందుంటారు. అంతేకాకుండా కరాటేలో బ్లాక్ బెల్ట్.. మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉంది. ప్రస్తుతం ఆయన హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాల్లో నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.