
పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఒకప్పుడు టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్. తెలుగుతో పాటు హిందీ, తమిళ్ భాషల్లో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులో ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో
అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, రాజేష్ ఖన్నా, సన్ని డియోల్ వంటి అగ్ర హీరోలతో తెరను పంచుకుంది. తన అందం, అభినయంతో 1990వ దశకంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్‌గా సంచలనం రేపింది. తన అభినయ ప్రతిభకు గుర్తింపుగా ఫిల్మ్ పేర్ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు కూడా అందుకుంది. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే ఈ ముద్దుగుమ్మ పెళ్లిపీటలెక్కింది. అంతే సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసిందీ అందాల తార. ఈ అందాల తార చివరిగా 1998లో ఓ సినిమాలో కనిపించింది. అంటే ఈ బ్యూటీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి సుమారు 27 ఏళ్లకు పైగానే అయ్యింది. అయితే ఇప్పటికీ చాలా మంది సినీ అభిమానులు ఈ సొగసరిని గుర్తు పెట్టుకున్నారంటే ఆమె చేసిన సినిమాలే. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆపద్భాంధవుడు హీరోయిన్ మీనాక్షి శేషాద్రి.
బాలీవుడ్‌లో 50 కు పైగా సినిమాల్లో నటించిన మీనాక్షి శేషాద్రి శోభన బాబు జీవన పోరాటం సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఆపద్బాంధవుడు సినిమాలో కలిసి నటించింది. ఇందులో ఆమె అందం, అభినయం తెలుగు ఆడియెన్స్ ను కట్టి పడేసింది. వీటి తర్వాత సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ కలిసి నటించిన విశ్వామిత్ర మూవీలో మేనక పాత్ర పోషించింది మీనాక్షి.
కాగా 1995లో హరీష్ మైసూర్ అనే వ్యక్తితో కలిసి పెళ్లిపీటలెక్కింది. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు ఇప్పుడు విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే భారతీయ మూలాలు మరవని మీనాక్షి విదేశాల్లో ఆసక్తి ఉన్నవారికి భరతనాట్యం, కథక్, ఒడిస్సీ నృత్యాలు నేర్పుతున్నారు. అంతేకాదు వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
అయితే అప్పటికీ, ఇప్పటికీ మీనాక్షి చాలా మారిపోయింది. ఆమె లేటెస్ట్ ఫొటోస్ చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.