
చాలా మంది అందాల భామలు కెరీర్ స్టార్టింగ్ లో పలు సినిమాల్లో సైడ్ రోల్స్ లో నటించి మెప్పించారు. చిన్న చిన్న పాత్రల్లో నటించి ఆ తర్వాత హీరోయిన్స్ గా మారి సినిమాలు చేశారు పైన కనిపిస్తున్న హీరోయిన్ ను చూశారా.. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో చిన్న పాత్రలో నటించింది. అసలు ఆమె ఆ సినిమాలో ఉందని కూడా చాలా మందికి తెలియదు. పై ఫోటో సూపర్ స్టార్ రజినీకాంత్ లింగ సినిమాలోది. ఈ సినిమాలో రజినీకాంత్ డ్యూయల్ రోల్ లో నటించారు. ఈ సినిమా బాక్సాఫిస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమాలో సూపర్ స్టార్ సరసన అనుష్క శెట్టి, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా నటించారు. ఇక పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఇప్పుడు మూడు వందలకోట్లు కొల్లగొట్టిన మూవీ హీరోయిన్ ..
రజినీకాంత్ లింగ సినిమాలో హీరోయిన్ సోనాక్షి సిన్హా వెనక కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో కాదు ఆమె అమృత అయ్యర్. కెరీర్ బిగినింగ్ లో పలు సినిమాల్లో చిన్న చిన్న పత్రాలు పాత్రలు చేసిన అమృత.. పదైవీరన్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. దళపతి విజయ్ హీరోగా నటించిన బిగిల్ సినిమాలో కీలక పాత్రలో నటించింది గుర్తింపు తెచ్చుకుంది అమృత అయ్యర్.
రామ్ పోతినేని హీరోగా నటించిన రెడ్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఆతర్వాత యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించటం ఎలా.? అనే సినిమాలో నటించింది. అలాగే అర్జున ఫల్గుణ సినిమాలో కనిపించింది. ఇక ఈ చిన్నది నటించిన హనుమాన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడమే కాదు కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టింది. ఈ సినిమా మొత్తంగా 300కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ చిన్నదానికి మరిన్ని అవకాశాలు క్యూ కడుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది అమృత.