జూనియర్ ఎన్టీఆర్‌కి.. యాంకర్ సుమ ఛాలెంజ్ విసిరింది. అందులోనూ.. మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాలోని.. డైలాగ్ చెప్పి మరీ ఎన్టీఆర్‌కి సుమ ఛాలెంజ్ విసిరింది. స్టాలిన్ సినిమాలోని ‘నువ్వు ముగ్గురికి సాయం చేయి.. ఆ ముగ్గురిని మరో ముగ్గురికి సాయం చేయమని చెప్పు’ అనే డైలాగ్.. అప్పట్లో బాగా ట్రెండ్ అయ్యింది. ప్రస్తుతం అదే డైలాగ్‌ని ఇప్పుడు ‘గ్రీన్ ఛాలెంజ్’ సారాంశంతో నడుస్తోంది. ఇందులో భాగంగానే.. యాంకర్ సుమ.. జూనియర్ ఎన్టీఆర్‌కి గ్రీన్ ఛాలెంజ్ విసిరింది.
ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ‘గ్రీన్ ఛాలెంజ్’ అనేది ట్రెండ్ అవుతోంది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు.. వాళ్ల పరిధిలోని వారికి ఈ ఛాలెంజ్‌ని విసురుతున్నారు. కాగా.. అందులో భాగంగానే.. ప్రముఖ సినీనటి జయసుధ, యాంకర్ అనసూయలు.. సుమకు ఛాలెంజ్ విసిరారు.
దీనికి.. సుమ స్పందిస్తూ.. తనకు గ్రీన్ ఛాలెంజ్ విసిరిన ప్రముఖ సినీ నటి జయసుధ, అనసూయకు థాంక్యూ చెప్తూ.. పచ్చటి మొక్కలను నాటింది. ఈ సందర్భంగా.. జూనియర్ ఎన్టీఆర్, మంచు లక్ష్మీ, యాంకర్ ఓంకార్, బిగ్‌బాస్ సీజన్ 3 టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌లకి ఆమె ఈ గ్రీన్ ఛాలెంజ్‌ని విసిరారు. అలాగే.. భావితరాలు సంతోషంగా.. ఆరోగ్యంతో ఉండాలంటే.. ఇలాంటి ఛాలెంజ్‌లు అవసరమని ఆమె చెప్పింది. మొక్కలతో.. వాయు కాలుష్యం తగ్గుతుందని పేర్కొంది సుమ కనకాల.
Accepted #greenindiachallenge from#jayasudha garu n @anusuyakhasba planted 3 saplings n now invite @tarak9999 @Rahulsipligunj @LakshmiManchu & #anchoromkar to plant 3 ?& continue the chain ?? thanks to @MPsantoshtrs for great intiate for climate change pic.twitter.com/sVD42YF8Qm
— Suma Kanakala (@ItsSumaKanakala) November 13, 2019