Gopichand: ‘ఆ స్టార్ హీరోతో మల్టీస్టారర్ మూవీ చేయాలని ఉంది’.. మనసులో మాట బయటపెట్టిన గోపీచంద్

టాలీవుడ్ టాల్ హీరో గోపీచంద్(Gopichand)నటిస్తున్న లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్. సక్సెస్ ఫుల్ దర్శకుడు మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

Gopichand: ఆ స్టార్ హీరోతో మల్టీస్టారర్ మూవీ చేయాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన గోపీచంద్
Gopichand

Updated on: Jun 25, 2022 | 7:49 PM

టాలీవుడ్ టాల్ హీరో గోపీచంద్(Gopichand)నటిస్తున్న లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్. సక్సెస్ ఫుల్ దర్శకుడు మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకున్న జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బ‌న్నీ వాస్ నిర్మాత‌గా రూపొందిన పక్కా కమర్షియల్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమా నుంచి రాశీ ఖన్నా లుక్ విడుదల చేసారు మేకర్స్. ఇందులో సీరియల్ ఆర్టిస్టుగా కడుపులు చెక్కలయ్యేలా నవ్వించడానికి రెడీ అయ్యారు రాశీ. ఈమె కారెక్టర్ ఎంత ఫన్నీగా ఉండబోతుందో.. మొన్న విడుదలైన ట్రైలర్‌తోనే అర్థమై ఉంటుంది. తాజాగా చిత్రయూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.పక్కకమర్షియల్ సంబంధించిన ప్రెస్ కాన్ఫెరెన్స్ విజయవాడలోని రాజ్ యువారాజ్ థియేటర్స్‌లో జరిగింది. ఈ సందర్భంగా హీరో గోపీచంద్ మాట్లాడుతూ..

పక్కా కమర్షియల్ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని.. కచ్చితంగా అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. అలాగే తనకు ప్రభాస్ అంటే చాలా ఇష్టమని.. ఎప్పుడైనా తనతో నటించడానికి సిద్ధమే అని తెలిపారు. పైగా ఆయనతో మల్టీస్టారర్ చేయాలని ఉన్నట్లు చెప్పారు గోపీచంద్. పక్కా కమర్షియల్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాను మారుతి చాలా తెరకెక్కించారని’ తెలిపారు. అనంతరం చిత్రయూనిట్ కనకదుర్గమ్మ గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి