
ఒకప్పుడు స్టార్ దర్శకుడిగా రాణించిన దర్శకుల్లో శ్రీను వైట్ల ఒకరు. ఆయన సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేయి. రవితేజ హీరోగా నటించిన నీకోసం సినిమాతో దర్శకుడిగా మారారు శ్రీను వైట్ల. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. మహేశ్వరి, రవితేజ జంటగా వచ్చిన ఈ సినిమా అందమైన ప్రేమకథగా తెరకెక్కించారు. ఈ సినిమా తర్వాత శ్రీను దర్శకత్వం వహించిన ఆనందం సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీలో అందమైన ప్రేమ కథతో పాటు కామెడీ కూడా జోడించారు. ఆతర్వాత శ్రీను వైట్ల తన సినిమాల్లో కామెడీకి పెద్ద పీట వేస్తూ వచ్చారు. ఆతర్వాత ఆయన తెరకెక్కించిన సొంతం (2002), వెంకీ (2004), అందరివాడు (2005), ఢీ (2007), దుబాయ్ శీను (2007)
రెడీ (2008) కింగ్ (2008) సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
కింగ్ సినిమా తర్వాత దాదాపు మూడేళ్ళ గ్యాప్ తీసుకున్న శ్రీను వైట్లను సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి దూకుడు సినిమా చేశారు. ఈ సినిమా 2011లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అప్పటివరకు పలు ఫ్లాప్ లతో సతమతం అవుతున్న మహేష్ కు ఈ సినిమా సాలిడ్ సక్సెస్ ను ఇచ్చింది. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ తో బాద్‍షా (2013) అలాగే మహేష్ సారి మహేష్ బాబుతో కలిసి ఆగడు సినిమాలు చేశారు. కానీ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసిబ్రూస్ లీ చేశారు. చివరిగా అమర్ అక్బర్ ఆంథోని సినిమా చేశారు ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
ఇక ఇప్పుడు టాలీవుడ్ టాల్ హీరో గోపీచంద్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజాకార్యక్రమం కూడా జరిగింది. చాలా కాలంగా గోపీచంద్ కూడా హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో రానున్న సినిమా ఎలా ఉండబోతుంది.? శ్రీను వైట్ల ఎలాంటి జోనర్ లో సినిమా చేస్తారు.? అని ప్రేక్షకుల్లో అంచనాలు మొదలయ్యాయి. మరి ఈ మూవీతో శ్రీను వైట్ల, గోపీచంద్ కంబ్యాక్ అవుతారేమో చూడాలి.
GOPICHAND – SREENU VAITLA COLLABORATE FOR NEW FILM… Director #SreenuVaitla’s next film – starring #Gopichand – was launched today with a pooja ceremony… Several dignitaries from the #Telugu film industry graced the launch.
Produced by #VenuDonepudi… Regular shoot commences… pic.twitter.com/4oUfx3H0Cd
— taran adarsh (@taran_adarsh) September 9, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.ఆడియన్స్