Sekhar Master: శేఖర్ మాస్టర్ అభిమానులకు షాకిచ్చిన గూగుల్.. ఆ విషయంలో పెద్ద పొరపాటే..

|

Jul 21, 2021 | 7:33 PM

తెలుగు రాష్ట్రాల్లో కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‏కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరపైనే కాకుండా.. వెండితెరపై కూడా ఆయనకు ప్రత్యేకంగా గుర్తింపు ఉంది.

Sekhar Master: శేఖర్ మాస్టర్ అభిమానులకు షాకిచ్చిన గూగుల్.. ఆ విషయంలో పెద్ద పొరపాటే..
Sekhar Master
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‏కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరపైనే కాకుండా.. వెండితెరపై కూడా ఆయనకు ప్రత్యేకంగా గుర్తింపు ఉంది. చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరిని శేఖర్ మాస్టర్ స్టెప్పులను ఫాలో కావాల్సిందే. అటు జనాలలో కూడా శేఖర్ మాస్టర్ డ్యాన్స్‏కు అభిమానులున్నారు. అటు స్టార్ హీరోలకు కూడా శేఖర్ మాస్టర్‏కు ఫిదా అయినవారే. బుల్లితెరపై జబర్ధస్థ్.. ఢీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ.. ఇటు టీవీ ప్రేక్షకులకు శేఖర్ మాస్టర్ సుపరిచితమే. తాజాగా ఆయన అభిమానులకు గూగుల్ షాకిచ్చింది.

గూగుల్ సెర్చ్ ఇంజిన్ పొరపాట్లు చేయడం ఇది కొత్తం కాదు. గతంలో కూడా పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నేతల విషయంలోనూ అనేక పొరపాట్లు జరిగాయి. అయితే తాజాగా ఇప్పుడు మరోసారి గూగుల్ సెర్చ్ ఇంజిన్ చేసిన పొరపాటుకు శేఖర్ మాస్టర్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం చేసిందో తెలుసా..

అసలు విషయం ఏంటంటే.. గూగుల్ సెర్చ్ ఇంజిన్‏లో శేఖర్ మాస్టర్ అని సెర్చ్ చేస్తే.. శేఖర్ మాస్టర్ ఫోటోస్ చూపిస్తుంది. అయితే ఇక్కడే తప్పు జరిగింది. ఆయనకు సంబంధించిన పూర్తి బయోడేటాను పూర్తిగా వేరే వారిది చూపిస్తుంది. అంటే శేఖర్ మాస్టర్ జననం.. మరణం తేదీలను కూడా చూపిస్తుంది. ప్రస్తుతం బతికి ఉన్న శేఖర్ మాస్టర్ 2003లో కన్నుమూసినట్లుగా చూపిస్తుంది. దీంతో గూగుల్ పై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలుగుతోపాటు తమిళ, మలయాళంలో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ శేఖర్ బయోడేటాను గూగుల్ శేఖర్ మాస్టర్‏ది అంటూ చూపిస్తుంది. ఈయన తెలుగులో చైల్డ్ ఆర్టిసుగా నటించగా.. అక్కా తమ్ముడు సినిమాలో తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత తమ్ముడిగా ఆయన నటించారు. అయితే సినీ పరిశ్రమలో అతడిని మాస్టర్ శేఖర్ అని పిలుస్తుండేవారు. శేఖర్ మాస్టర్.. మాస్టర్ శేఖర్ అనే పేర్లు ఒకేలా ఉండడంతో దివంగత నటుడు మాస్టర్ శేఖర్ బయోడేటాను .. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ‏గా చూపిస్తుంది. ఇక గూగుల్ చేసిన పొరపాటుకు అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Anasuya: వర్షంపై కవిత్వాన్ని షేర్ చేసిన అనసూయ.. ఆ అందమైన కవిత్వం ఎవరు రాసిందో తెలుసా..

షూటింగ్ సమయంలో చిరంజీవి నాపై అరిచాడు.. అసలు కారణం అదే.. ఆసక్తికర విషయాలను చెప్పిన అన్నపూర్ణ..