
2023లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించింది. ఈ ఏడాది చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, షారుఖ్ ఖాన్, సన్నీడియోల్, అక్షయ్ కుమార్, సాయి ధరమ్ తేజ్ వంటి స్టార్ హీరోస్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయలు రాబట్టాయి. అలాగే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారీ బడ్జెట్ చిత్రాలను విడుదలైన మొదటి రోజే థియేటర్లలో చూడడం చాలా కష్టం. ఎందుకంటే టిక్కెట్ ధర (సినిమా టిక్కెట్ల ధర) ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్ లలో సినిమాలు చూడడం ఒక కలే. కానీ ఇప్పుడు మల్టీఫ్లెక్స్ లలోనూ ప్రతి ఒక్కరు తక్కువ ధరకే సినిమా చూసే ఆఫర్ ఉంది. ‘నేషనల్ సినిమా డే’ సందర్భంగా సినిమా టిక్కెట్లను కేవలం 99 రూపాయలకే విక్రయించాలని నిర్ణయించారు . దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
కోవిడ్ వచ్చాక సినిమా పరిశ్రమ స్తబ్దుగా ఉంది. మరోవైపు ఓటీటీలకు రోజు రోజుకు ఆదరణ పెరిగిపోతుంది. భారీ సంఖ్యలో ప్రేక్షకులను సినిమాకి రప్పించేందుకు కొంత ప్రణాళిక రూపొందించారు. ఇందులోనే ‘నేషనల్ సినిమా డే’ వేడుక కూడా ముఖ్యమైనది. దేశవ్యాప్తంగా చాలా మల్టీప్లెక్స్‌లు, ఎంపిక చేసిన థియేటర్లలో సెలక్ట్ చేసిన రోజున అన్ని సినిమాల టిక్కెట్‌లను తక్కువ ధరకు అమ్మడమే దీని లక్ష్యం. ఈ ప్రయత్నానికి మంచి స్పందన వచ్చింది. అందుకే ఈ ఏడాది కూడా ‘నేషనల్ సినిమా డే’ జరుపుకోవాలని మల్టీప్లెక్స్‌లు, థియేటర్ల యాజమాన్యాలు నిర్ణయించుకున్నాయి.
ఈ ఏడాది అక్టోబర్ 13న ‘నేషనల్ సినిమా డే’ని జరుపుకోనున్నారు. PVR, Inox, Cinepolis, Mirage, CityPride, Asian, MovieTine వంటి మల్టీప్లెక్స్‌లు ఇందులో ఉండనున్నాయి. అంటే అక్టోబర్ 13న దేశవ్యాప్తంగా అన్ని సినిమాల టిక్కెట్లు కేవలం 99 రూపాయలకే అందుబాటులో ఉంటాయి. ఆ రోజు స్నాక్స్, డ్రింక్స్ ధరలు కూడా తగ్గనున్నాయి. ఈ క్రమంలోనే ఆ రోజు భారీ సంఖ్యలో ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారని అంచనా వేస్తున్నారు నిర్వాహకులు.
NATIONAL CINEMA DAY ON 13 OCT… TICKETS PRICED AT ₹ 99/-… 4000+ SCREENS TO PARTICIPATE… Details in the OFFICIAL STATEMENT issued by #MAI. pic.twitter.com/L3ewzlvNgI
— taran adarsh (@taran_adarsh) September 21, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.