Tollywood: గోదావరి మూవీలో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా..? 42 ఏళ్ల వయస్సులో మత్తెక్కించేలా

2006లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన గోదావరి సినిమాలో రాజీ పాత్రలో మెరిసిన ఈ హీరోయిన్ గుర్తుందా..? తను ఇప్పుడు ఎలా ఉంది..? ఏం చేస్తుంది...? ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Tollywood: గోదావరి మూవీలో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా..? 42 ఏళ్ల వయస్సులో మత్తెక్కించేలా

Updated on: Oct 25, 2024 | 1:05 PM

తెలుగు ఇండస్ట్రీలో శేఖర్ కమ్ములకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సెన్సుబుల్ చిత్రాలు తీస్తారనే పేరు తెచ్చుకున్నారు ఈ డైరెక్టర్. ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా  పాత్రలు తీర్చిదిద్దడంలో ఆయన ఎక్స్‌పర్ట్.  ఆయన తీసిన అందమైన దృశ్యకావ్యం గోదావరి సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. 2006 మే 19న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కాగా, ఇందులో హీరోహీరోయిన్లుగా సుమంత్, కమలినీ ముఖర్జీ నటించారు. ఇకపోతే ఈ సినిమాలో సుమంత్ మరదలుగా పల్లెటూరి అమ్మాయి పాత్రలో మరో హీరోయిన్ కూడా నటించింది. తను ఇప్పుడు ఎలా ఉంది..? ఏం చేస్తోందో తెలుసుకుందాం పదండి.

ఆ సందరాంగి పేరు ‘నీతూ చంద్ర’. ఈ బ్యూటీ 1984, జూన్ 20న బీహార్ లోని పాట్నాలో పుట్టింది. ఇక అక్కడే తన గ్రాడ్యూషన్ కంప్లీట్ చేసిన నీతూ.. నటనపై ఆసక్తితో మోడలింగ్ వైపు అడుగులు వేసింది. ఆ తర్వాత ఈ అమ్మడి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ తెలుగులోనే జరిగింది. 2003లో రిలీజైన ‘విష్ణువు’ అనే మూవీలో యాక్ట్ చేసింది. దీని తర్వాత 2005లో గరం మసాలా అనే చిత్రంలో ప్రేక్షకుల ముందకు వచ్చింది. ఈ రెండు సినిమాలతో ఈ అమ్మడు మేకర్స్ దృష్టిలో పడింది. అలా 2006లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన గోదావరి సినిమాలో రాజీ పాత్రలో  చాన్స్ దక్కించుకుంది. ఇలా ఈ సినిమాలో మరదలు క్యారెక్టర్‌లో నటించిన.. నీతూ నటనకు ప్రేక్షకులు క్లీన్ బౌల్డ్ అయ్యారు. అయితే టాలెండ్, అందం ఉన్న కూడా తర్వాతి కాలంలో నీతూకి తెలుగులో సరైన అవకాశాలు రాలేదు.

ఆ తర్వాత తమిళ్, హిందీ తన మాతృభాష అయిన భోజపురి భాషాలో పలు చిత్రాల్లో నటించింది. ఇక చివరిగా ఈమె 2021లోని హాలీవుడ్ నెవర్ బ్యాక్ డౌన్ అనే మూవీలో మెరిసింది. ఇదిలా ఉంటే.. సినిమాల్లో హీరోయిన్‌గా తన అందంతో కట్టి పడేసిన నీతూ చంద్ర.. కరాటేలో బ్లాక్ బెల్డ్ సాధించిందట. కరాటే, తైక్వాండో  విద్యల్లో రాణించి.. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంది.

కాగా 2018లో ప్రో కబడ్డీ లీగ్‌లో పాట్నా పైరేట్స్‌కు నీతూ కమ్యూనిటీ అంబాసిడర్‌గా చేసింది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్. నిత్యం తనకు సంబంధించిన గ్లామరెస్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. ఇక ఆ ఫోటోస్ నీతూ.. 42 ఏళ్ల వయసులో అదే చార్మ్‌తో అందర్నీ ఆకట్టుకుంటుంది. ఆమె లేటెస్ట్ పిక్స్‌పై ఓ లుక్ వేద్దాం పదండి…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.