Ram Charan Birthday: మెగా పవర్ స్టార్ టూ గ్లోబల్ స్టార్.. రామ్ చరణ్ పుట్టినరోజు స్పెషల్..

చిరుత సినిమాతో హీరోగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన చరణ్.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి మెగా పవర్ స్టార్ అనిపించుకున్నారు. సినీ ప్రయాణంలో ఓవైపు వారసత్వం అన్న విమర్శలు.. మరోవైపు పరాజయాలు ఎదురైనా ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా కసిగా నటించి తానేంటో నిరూపించుకుని ఆస్కార్ వేదికగా అడుగుపెట్టి గ్లోబల్ స్టార్ అయ్యాడు. మెగా పవర్ స్టార్ సినిమాలకు ఇప్పుడు ప్రేక్షకలోకం నీరాజనం పడుతుంది.

Ram Charan Birthday: మెగా పవర్ స్టార్ టూ గ్లోబల్ స్టార్.. రామ్ చరణ్ పుట్టినరోజు స్పెషల్..
Ram Charan
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 27, 2024 | 1:44 PM

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీరంగ ప్రవేశం చేసి ఇప్పుడు గ్లోబల్ స్టార్‏గా క్రేజ్ సొంతం చేసుకున్నాడు హీరో రామ్ చరణ్. వైవిధ్యభరిత కథలను ఎంచుకుంటూ విలక్షణ నటనతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను మెస్మరైజ్ చేశాడు. మెగా వారసుడిగా తెరంగేట్రం చేసినా.. అద్భుతమైన నటనతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ముందు స్టార్ కిడ్ అని.. విమర్శలు వచ్చినా.. రంగస్థలం సినిమాతో  విమర్శించిన చోటే ప్రశంసలు అందుకున్నాడు. నటనతో సినీ ప్రముఖులు, అభిమానులతో భేష్ అనిపించున్నాడు. చిరుత సినిమాతో హీరోగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన చరణ్.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి మెగా పవర్ స్టార్ అనిపించుకున్నారు. సినీ ప్రయాణంలో ఓవైపు వారసత్వం అన్న విమర్శలు.. మరోవైపు పరాజయాలు ఎదురైనా ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా కసిగా నటించి తానేంటో నిరూపించుకుని ఆస్కార్ వేదికపై అడుగుపెట్టి గ్లోబల్ స్టార్ అయ్యాడు. మెగా పవర్ స్టార్ సినిమాలకు ఇప్పుడు ప్రేక్షకలోకం నీరాజనం పడుతుంది. ఒకప్పుడు చిరంజీవి క్రేజ్.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మేనియా.. నేటితరానికి రామ్ చరణ్ అంటే అదే రేంజ్ క్రేజ్ ఉందంటే అతిశయోక్తి లేదు. చరణ్ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూసే అభిమానులు ఉన్నారు.

నటుడిగానే కాకుండా బెస్ట్ డ్యాన్సర్‎గా గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోయిజం రోల్స్ కాదు.. కంటెంట్ బలంగా ఉంటే ఎలాంటి పాత్ర అయినా చేయగలనని రంగస్థలం సినిమాతో నిరూపించారు. అమ్మ ప్రేమ కోసం ఆరాటపడే కుర్రాడిగా.. ఆ తర్వాత రాజ్యం కోసం యువరాణి ప్రేమను వదిలేసే సైనికుడిగా.. ప్రేమ కొంతకాలమే బాగుంటుందని చెప్పే లవర్ బాయ్‏గా అలరించాడు. ఇప్పటికే ఎన్నో డిఫరెంట్ రోల్స్ చేసి నిరూపించుకున్నాడు చరణ్. మెగా వారసుడిగా .. చిరంజీవి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నాడు చరణ్. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్.. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న గేమ్ ఛేంజర్ మూవీ కోసం వేయ కళ్లతో వెయిట్ చేస్తున్నారు అభిమానులు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.

అలాగే ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఇందులో జాన్వీ కపూర్ నటిస్తుంది. అలాగే మరోసారి రంగస్థలం కాంబో రిపీట్ కానుంది. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చరణ్ మరో సినిమా చేయనున్నాడు. ఈ మూవీకి సంబంధించిన వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. ఈరోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో చరణ్ అరుదైన ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. అలాగే ఈరోజు అభిమానులకు చరణ్ నెక్ట్స్ ప్రాజెక్టులకు సంబంధించిన స్పెషల్ సర్ ప్రైజ్ రానున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..
ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
సంధ్య థియేటర్ ఘటన .. ఊహించని వీడియో రిలీజ్ చేసిన సీపీ
సంధ్య థియేటర్ ఘటన .. ఊహించని వీడియో రిలీజ్ చేసిన సీపీ