Vakeel Saab Trailer: ట్రైలర్ రిలీజ్‌కే ఇట్టా ఉంటే.. సినిమా రిలీజ్‌కు ఎట్టా ఉంటందో.. పవన్ ఫ్యాన్సా మజాకా..!

Glass of the Theatre: 'వకీల్‌సాబ్‌' ట్రైలర్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఎగబడ్డారు. దీంతో పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. థియేటర్‌లోకి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ తోసుకు రావడంతో...

Vakeel Saab Trailer: ట్రైలర్ రిలీజ్‌కే  ఇట్టా ఉంటే.. సినిమా రిలీజ్‌కు ఎట్టా ఉంటందో.. పవన్ ఫ్యాన్సా మజాకా..!
Vakeel Saab Trailer

Edited By:

Updated on: Mar 30, 2021 | 10:52 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘వకీల్‌ సాబ్‌’ ట్రైలర్ దుమ్ము రేపుతోంది. రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. అంతే కాదు ఫ్యాన్స్ తాకిడితో థియేటర్లు కూడా బద్దలవుతున్నాయి. అవును నిజమండి బాబు.. సోమవారం విశాఖపట్నంలోని సంగం శరత్ థియేటర్‌లో విడుదలైన ట్రైలర్‌ను చూసేందుకు అభిమానలు పోటెత్తారు. ఇక ‘వకీల్‌ సాబ్‌’ ట్రైలర్ చూసేందుకు థియేటర్‌లోకి తోసుకు పోయారు.

ఈ ట్రైలర్‌ను మార్చి 29 న సాయంత్రం 4 గంటల సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్లలో విడుదల చేశారు. పవర్ స్టార్ అభిమానులు మధ్యాహ్నం 2 గంటలకు థియేటర్ వద్దకు చేరుకుని పవన్ కళ్యాణ్ భారీ కటౌట్‌కు పూజలు, పూల దండలు వేసి కొబ్బరికాయలు కొట్టారు. అభిమానులు ఒక్కసారిగా తోసుకు రావడంతో థియేటర్ అద్దాల డోర్ పగిలిపోయింది. అయినప్పటికీ అభిమానులు ట్రైలర్ చూడటానికి లోపలికి పరుగులు పెట్టారు.

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’ సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. పవన్‌కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత నటించిన చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు పెరిగిపోయిన విషయం తెలిసిందే.

ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 9న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయనడానికి విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ యూ ట్యూబ్‌లో ట్రెండ్‌ క్రియేట్‌ చేయడమే కాకుండా.. వ్యూస్‌, లైక్స్‌ పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తోంది.

‘వకీల్‌సాబ్‌’ ట్రైలర్‌కు ఇప్పటికే 12 మిలియన్స్‌ వ్యూస్‌ రాగా.. దాదాపు 8 లక్షలకు పైగా లైక్స్‌ వచ్చాయి. ‘వకీల్‌సాబ్‌’ ట్రైలర్‌ విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనే మిలియన్‌ లైక్స్‌ను ఊరకలు వేస్తుంది. మిలియన్ లైక్స్‌ వస్తే.. ఈ రికార్డ్‌ను సాధించిన తొలి చిత్రం ‘వకీల్‌ సాబ్‌’ అవుతుంది.

ఇవి కూడా చదవండి : TTD Plans: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమ‌ల‌లో ట్రాఫిక్‌ ప్రాబ్లమ్స్‌కి చెక్.. మ‌ల్టీలెవ‌ల్ కార్ పా‌ర్కింగ్‌ల ఏర్పాటు.. కొండపై ఎక్కడో తెలుసా..

Sultan of Multan: ముల్తాన్ కా సుల్తాన్‌.. పాకిస్తాన్‌కు చెప్పి మరీ కొట్టాడు.. ఒకటి కాదు రెండు కాదు మూడు సెంచరీలు..

ఆదిలాబాద్‌ జిల్లా అడవుల్లో బయటపడిన వెయ్యేళ్ల నాటి పురాతన ఆలయం.. రాక్షస రాజులే నిర్మించారా..?