సావిత్రి భర్త జెమిని గణేశన్ స్త్రీలోలుడా?.. అయినా పిల్లల పెంపకంలో గొప్పవాడే.. ఏడుగురు కూతుర్లు మంచి పొజిషన్ లోనే

| Edited By: Surya Kala

Jul 16, 2021 | 6:42 PM

Gemini Ganesan: తమిళ సినీరంగంలో అలనాటి ప్రముఖ హీరోల్లో ఎం.జీ.ఆర్, శివాజీ గనేషన్ ల తర్వాత స్థానం జెమిని గనేషన్ ది. జాతీయ స్థాయిలో అవార్డులు అందుకోకపోయినా..

సావిత్రి భర్త జెమిని గణేశన్ స్త్రీలోలుడా?.. అయినా పిల్లల పెంపకంలో గొప్పవాడే.. ఏడుగురు కూతుర్లు మంచి పొజిషన్ లోనే
Gemini Gneshan
Follow us on

Gemini Ganesan: తమిళ సినీరంగంలో అలనాటి ప్రముఖ హీరోల్లో ఎం.జీ.ఆర్, శివాజీ గణేశన్ ల తర్వాత స్థానం జెమిని గణేశన్ ది. జాతీయ స్థాయిలో అవార్డులు అందుకోకపోయినా ప్రేక్షకులతో రొమాంటిక్ హీరో అన్న బిరుదును అందుకున్నారు. రుద్రవీణ లో చిరంజీవి తండ్రిగా, భామనే సత్యభామనే సినిమాతో కమల్ హాసన్ మామగా నటించిన జెమిని గణేశన్ వెండి తెరపైనే కాదు.. రియల్ గా కూడా రొమాంటిక్ జీవితం గడిపిన వ్యక్తీ. తనతో నటించిన హీరోయిన్ లలో చాలామందితో సంబంధాలు పెట్టుకోనేవారని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్.

దీంతో ఆయన స్త్రీలోలుడు అన్న ప్రచారం ఉంది.. జెమిని గణేశన్ ఏకంగా నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నారు.. ఆ నలుగురు భార్యల్లో ముగ్గురు భార్యలకు సంతానం ఉంది.. అందులో ఏడుగురు ఆడపిల్లలు.. ఒక అబ్బాయి… అంటే మొత్తం ఎనిమిది మంది జెమిని గణేశన్ సంతానం. ఇక సావిత్రి బయోపిక్ తో తెరపైకి జెమిని గణేశన్ కు సావిత్రి కి పుట్టిన విజయ చాముండేశ్వరి, సతీష్ లు వచ్చారు. ఇక మా నాన్న చాలా మంచి వారు అంటూ.. మొదటి భార్య అలివేలు కుమార్తె కమలా సెల్వరాజ్ వెలుగులోకి వచ్చారు.

మొదటి భార్య అలివేలుకు నలుగురు కుమార్తెలు వారు డాక్టర్ జయ శ్రీధర్, డాక్టర్ రేవతి స్వామినాధన్, డాక్టర్ కమలా సెల్వరాజ్, నారాయణి గణేశన్‌లు. ఇక రెండో భార్య పుష్పవల్లికి కుమార్తెలు బాలీవుడ్ నటి రేఖ, రాధా సయ్యద్‌లు. మూడో భార్య తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దేవత, అందాల అభినేత్రి మహానటి సావిత్రి పిల్లలు విజయ చాముండేశ్వరి, సతీష్‌లు. ఈ మొత్తం ఎనిమిది మంది జెమిని గణేశన్ సంతానం.

అంతమందిని పెళ్లి చేసుకున్నా అన్ని సంసారాలను నడపటంలో తాను ఏమాత్రం ఇబ్బంది పడలేదని జెమిని చెప్పేవారట. అయితే తాను ఎవరినీ బుట్టలో వెయ్యలేదని మానసికంగా ఇబ్బందులున్నవారు తనకు దగ్గరయ్యేవారని  స్వయంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కూడా. అప్నటికే  ముగ్గురు భార్యలు.. ఎనిమిది మంది సంతానం ఉన్నా జెమిని గణేశన్‌ తన 78 ఏట మళ్ళీ ప్రేమలో పడ్డారు. విమానంలో ప్రయాణం చేస్తున్న సమయంలో జూలియన్ అనే 36 ఏళ్ల యువతితో పరిచయం ప్రేమగా మారింది.. అంటే తన కూతురు వయసున్న అమ్మాయితో మళ్ళీ ప్రేమలో పడ్డారు జెమిని గణేశన్‌.. అనంతరం వీరిద్దరూ రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారు. తన మొదటి భార్య అలివేలు వయసు అయ్యిపోయింది.. కనుక చిన్న వయసున్న భార్య కావాలని పెళ్లి చేసుకున్నా అని ప్రకటించి సంచలనం సృష్టించారు.. జెమిని గణేషన్.. అలా తన జీవితం చివరి వరకూ ఎప్పటికప్పుడు ఒక కొత్త ప్రేయసిని వెదుక్కుంటూ.. పాత ప్రేమలను కొనసాగిస్తూ.. రొమాంటిక్ హీరోగా బ్రతికిన జెమిని గణేశన్‌ 2005 మే 22 న మరణించారు.

అంతమంది అమ్మాయిలను ప్రేమించగలగటం జెమిని గొప్పతనమా… లేక అందరినీ పెళ్లి చేసుకోవడం అతని తప్పా… ఎవరు చెప్పగలరు..? ఏది ఏమైనా ఆయనలో ఎదో తెలియని ఆకర్షణ ఉందని అంగీకరించాలి.. ఎందుకంటే ఆయనని పెళ్లి చేసుకున్న భార్యలు ఎవరూ ఆయనకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. కానీ సావిత్రి కెరీర్ ను నాశనం చేసింది.. తాగుడు అలవాటు చేసింది.. మాత్రం జెమినేనే.. ఆవిధంగా ఎప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఆయన అపరాదిగానే కనిపిస్తారు.

Also Read: కూతురు కీర్తిని జ్ఞాపకం చేసుకున్న అన్నపూర్ణ.. ఎందుకు అలా చేసిందో ఇప్పటికీ తెలియదంటూ కన్నీరు