Shaakuntalam: అరరే.. శాకుంతలం సినిమాలో ఈ సీన్ గమనించారా ?.. అల్లు అర్హ ఇక్కడ చాలా కష్టపడింది..

|

Jun 03, 2023 | 6:43 PM

మహాభారతంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథా ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. ఇందులో సమంత.. మలయాళీ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రలు పోషించగా.. మోహన్ బాబు, గౌతమి, మధుబాల, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలలో నటించారు. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తీవ్ర నష్టాలను మిగిల్చింది.

Shaakuntalam: అరరే.. శాకుంతలం సినిమాలో ఈ సీన్ గమనించారా ?.. అల్లు అర్హ ఇక్కడ చాలా కష్టపడింది..
Allu Arha
Follow us on

సమంత కెరీర్‏లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ శాకుంతలం. డైరెక్టర్ గుణశేఖర్ రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన సంగతి తెలిసిందే. మహాభారతంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథా ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. ఇందులో సమంత.. మలయాళీ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రలు పోషించగా.. మోహన్ బాబు, గౌతమి, మధుబాల, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలలో నటించారు. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తీవ్ర నష్టాలను మిగిల్చింది. కేవలం తెలుగులోనే కాదు.. మిగతా అన్ని భాషల్లోనూ ఈసినిమా ప్లాప్ టాక్ వచ్చింది. ఇక ఓటీటీలోనూ అదే తంతు.. ఈసినిమాకు ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు.

ఈ సినిమాలో భరతుడి పాత్రలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ నటించింది. ఈసినిమాతోనే అర్హ వెండితెరకు పరిచయమైంది. శాకుంతలం సినిమా ప్లాప్ అయినప్పటికీ ఇందులో అర్హ నటన హైలెట్ అనే చెప్పాలి. ముఖ్యంగా అందరి చూపు అర్హపైనే ఉన్నాయి. భరతుడి పాత్రలో అర్హ నటన అద్భుతమంటూ ప్రశంసలు అందుకుంది. ఇక తనకు సంబంధించిన సీన్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

తాజాగా అర్హకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. అందులో దుష్యంతుడి పాత్రలో ఉన్న దేవ్ మోహన్ అర్హను ఎత్తుకొని మాట్లాడుతున్న సమయంలో అర్హకు నవ్వు వచ్చింది. కానీ తన నవ్వును ఆపుకోవడానికి.. కనిపించకుండా ఉండేందుకు చాలానే కష్టపడింది. అయితే ఈ సీన్ సినిమాలో కనిపిస్తుంది. దీంతో ఎడిటర్ గమనించని ఈ ఫన్నీ సీన్ ను నెటిజన్స్ పట్టేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఓ సన్నివేశం జరుగుతున్న సమయంలో చిన్నారి అర్హ నవ్వు కంట్రోల్ చేసుకోవడానికి పడే కష్టం చూస్తే మీరు కూడా నవ్వేస్తారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.