కరోనా వైరస్.. కంటికి కనిపించని అతి చిన్న వైరస్.. కానీ ఆరడుగుల మనిషిని గడగడలాడిస్తుంది. దాదాపు సంవత్సరాల కాలానికి పైగా ఈ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతుంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది ప్రముఖులు, సామాన్య ప్రజలు ప్రాణాలను వదిలారు. ఇక కొన్ని నెలలుగా తగ్గుతూ వచ్చిన ఈ మహమ్మారి ప్రభావం.. ప్రస్తుతం భారత్లో సెకండ్ వేవ్ అంటూ ప్రజలపై విరుచుకుపడుతోంది. ఈ మహమ్మారి బారిన పడి రోజుకీ వేలల్లో ప్రాణాలను వదులుతున్నారు. రోజుకు మూడు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ ప్రభావం అటు సినీ పరిశ్రమను మరింతగా దెబ్బతీసింది. వైరస్ బారిన పడి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు మృతిచెందగా.. మరికొందరు ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలో సినీ కార్మికులకు త్వరలోనే టీకా పంపిణి చేస్తామని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. తాజాగా పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు ప్లాస్మా దానం చేయాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. Megastar chiranjeevi
ప్లాస్మా దానం చేయండి. దీనివలన కరోనా నుంచి కోలుకోవడానికి సహాయపడినవారవుతారు అంటూ మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కరోనా సెకండ్ వేవ్ లో బాధితులు మరింతగా పెరుగుతున్నారు. ముఖ్యంగా ప్లాస్మమా కొరతతో చాలా మంది ప్రాణాల కోసం పోరాడుతున్నారు. వారిని ఆదుకునేందుకు మీరు ముందుకు రావాల్సిన సమయమిది. మీరు కరోనా నుంచి కొద్ది రోజుల ముందే రికవర్ అయినట్లయితే మీ ప్లాస్మాని డోనేట్ చేయండి. దీనివల్ల ఇంకో నలుగురు, కరోనా నుంచి త్వరగా కోలుకుంటారు. నా అభిమానులు కూడా ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో పాల్గోనాల్సిందిగా కోరుకుంటున్నాను. వివరాల కోసం చిరంజీవి ఛారిటబుల్ ఫౌండేషన్ కార్యాలయాన్ని (040-23554849, 94400 55777) సంప్రదించవచ్చు అంటూ చిరు ట్వీట్ చేసారు. Venkatesh కేవలం మెగాస్టార్ మాత్రమే కాకుండా ప్లాస్మా దానం చేయాలంటూ వెంకటేశ్, నాగార్జున సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు. ‘కొవిడ్ నుంచి కోలుకున్న వారు ప్లాస్మా ఇచ్చేందుకు సంబంధిత వెబ్‌సెట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని కోరుతున్నాను’ అని ట్వీట్ చేశారు. Akkineni Nagarjuna
ట్వీట్స్..
As we know, Second wave of Covid is impacting even more people.If you have recovered from Covid in last few days,please donate your plasma so it can help 4 more people to combat Covid effectively.Please contact #ChiranjeeviCharitableFoundation (94400 55777)for details & guidance. pic.twitter.com/LXt2fFJYFs
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 3, 2021
వెంకటేశ్..
I request each and everyone who has recovered from COVID to register and donate plasma to those who need it! Let’s be there for each other ??????https://t.co/lDmqDNmp0Y
9490617440@cyberabadpolice https://t.co/PV1SOgeanA— Venkatesh Daggubati (@VenkyMama) May 3, 2021
నాగార్జున..
Friends,
Save lives in these unprecedented times by donating plasma.
All recent Covid recovered; Join the initiative by T-Hope & help make a differencehttps://t.co/wGWaNGpzBY#COVID19 #CovidIndiaInfo #COVIDIndiaHelp— Nagarjuna Akkineni (@iamnagarjuna) May 3, 2021
Also Read: Ileana: ప్రెగ్నెంట్.. అబార్షన్.. ఆత్మహత్యాయత్నం.. అసలు మ్యాటర్ చెప్పిన ఇలియానా..