Venkaiah Naidu: తెలుగులో ఇలాంటి పాటలు ఇంకా రావాలి.. కృష్ణం వందే యశోదరం పాటపై వెంకయ్య ప్రశంసలు

|

Nov 17, 2022 | 8:49 PM

'కృష్ణం వందే యశోదరం' పాటపై మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ప్రశంసలు కురిపించారు. తెలుగంత మధురంగా ఉందన్నారు.

Venkaiah Naidu: తెలుగులో ఇలాంటి పాటలు ఇంకా రావాలి.. కృష్ణం వందే యశోదరం పాటపై వెంకయ్య ప్రశంసలు
Venkaiah Naidu Appreciated Krishnam Vande Yashodaram song
Follow us on

ఈ మధ్యకాలంలో ప్రైవేట్ ఆల్బమ్స్ సత్తా చాటుతున్నాయి. తమ అభిరుచిని ప్రతిబింభించేలా కొందరు పాటలను రూపొందించి.. వీక్షకుల అభిమానాన్ని చూరగొంటున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ప్రజలను చాలా బాగా ఆకట్టుకుంది సీనియర్ జర్నలిస్ట్, రచయిత్రి చిత్రలేఖ మామిడిశెట్టి నటించి, నర్తించి, నిర్మించిన  ‘కృష్ణం వందే యశోదరం’ అమ్మ పాట. ఇటీవలే ఆదిత్య మ్యూజిక్‌ య్యూటూబ్‌ ఛానెల్‌లో విడుదలైన ఈ పాట విశేష ప్రేక్షకుల ఆదరణ పొందింది. ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఈ పాటకు గాత్రం అందించారు.. కారుణ్య కత్రిన్ దీనికి దర్శకత్వం వహించగా.. కన్నయ్యగా ప్రముఖ ఆర్టిస్ట్ రోషన్ నటించాడు.

తాజాగా చిత్రలేఖ మామిడిశెట్టి గురువారం మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు. వీడియో సాంగ్‌ను తిలకించిన ఆయన.. తెలుగు జాతి హుందాతనం, అమ్మ ప్రేమ కమ్మదనం ఉట్టిపడేలా ఈ పాటను చిత్రీకరించారని అభినందించారు. రకరకాల భాషలు, సరికొత్త సంస్కృతుల మధ్య స్వచ్ఛమైన అనుభూతికి కాసింత దూరమై.. అసహజ భావనల నడుమ సతమతమవుతోన్న భారతీయతకు ప్రాణం పోసే ఇటువంటి మరిన్ని పాటలు రూపొందించాలని సూచించారు.

పాటను దిగువన వీక్షించండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..