ప్రముఖ ఫోక్ సింగర్ మరియు తెలంగాణ సంస్కృతిక సారది ఉద్యోగిగా పనిచేస్తున్న మల్లిక్ తేజ్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తోటి మహిళా ఫోక్ సింగర్ ఆయనపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో జగిత్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె ఆరోపణల ప్రకారం, మాల్లిక్ తేజ్ మాయమాటలు చెప్పి ఆమెను లైంగిక దాడి చేశారని పోలీసులకు తెలిపారు. ఈ కేసు నేపథ్యంలో, మల్లిక్ తేజ్ తనను తప్పుగా అర్థం చేసుకున్నారని, అసత్య ఆరోపణలతో తనపై కేసు పెట్టారని వాదిస్తూ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు.
మల్లిక్ తేజ్ తరపున న్యాయవాది జక్కుల లక్ష్మణ్, తేజ్ పై నమోదైన కేసులో ఎలాంటి సాక్ష్యాదారాలు లేవని, ఇది పూర్తిగా నీరాధార ఆరోపణలేనని కోర్టులో వాదించారు. లక్ష్మణ్ గారి వాదన ప్రకారం, సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న మల్లిక్ తేజ్‌ను కావాలనే ఇబ్బంది పెట్టడానికే ఈ అక్రమ కేసు పెట్టారని పేర్కొన్నారు.
కేసులో సమగ్ర పరిశీలన తరువాత, హైకోర్టు మల్లిక్ తేజ్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. న్యాయవాది లక్ష్మణ్ కోర్టు ముందు మాట్లాడుతూ, “ఇటీవల చాలా మంది అమ్మాయిలు అక్రమ కేసులు పెట్టి, మగవాళ్ళను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. బాధితురాలు కూడా ఫేమస్ అవడానికే మల్లిక్ తేజ్ పై ఈ కేసు పెట్టిందని,” పేర్కొన్నారు.
అంతేకాక, ఫిర్యాదుదారు డబ్బుల కోసం ముందుగా మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టి, తరువాత జగిత్యాలలో ఈ రేప్ కేసును నమోదు చేసిందని ఆయన ఆరోపించారు. మల్లిక్ తేజ్ తరపున కోర్టు ముందుకు వెళ్ళిన తర్వాత, హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.