
తన డాన్స్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది జాను లిరి. ఫోక్స్ సాంగ్స్ కు డాన్స్ చేస్తూ పాపులర్ అయ్యింది జానులిరి. తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది జాను. ఈ క్రేజీ డాన్సర్ చేసిన సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేశాయి. పాన్ ఇండియా రేంజ్ లో జాను సాంగ్స్ పాపులర్ అయ్యాయి. ఇక జాను పలు టీవీ షోల్లో పాల్గొంది. కాగా జాను గతంలో ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన స్నేహితులు, ప్రేమ, జీవితం గురించి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో ఐదుగురు సన్నిహిత స్నేహితులున్నారని, వారందరూ సైడ్ డాన్సర్స్, యూనియన్ డాన్సర్స్ అని జాను తెలిపారు. వీరు తనకు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ అని చెప్పుకొచ్చింది. ఒకరికొకరు తమ బంధానికి గుర్తుగా టాటూలు వేయించుకున్నారని, తన స్నేహితులు అందరూ జాను అని, తాను మాత్రం తన పేరులో ఎస్ అనే అక్షరాన్ని వేయించుకున్నానని చెప్పుకొచ్చింది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తన స్నేహితులు తన నుండి దూరమయ్యారని జాను ఆవేదన వ్యక్తం చేసింది.
తాము ఉంటే జాను సంతోషంగా ఉండలేకపోతుందని భావించి, లేదా ఇతరులకు జాను వారితో మాట్లాడటం ఇష్టం లేదని తెలిసి, తన సంతోషం కోసమే వారు తమను తాను దూరం చేసుకున్నారని ఆమె తెలిపింది. నా మీద ఒట్టేసి వెళ్ళిపోయారు అని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. మూడేళ్లుగా వారు తనకు ఫోన్ చేయడం లేదని, అయితే తన పుట్టినరోజున మాత్రం గుర్తు చేసుకుంటారని, తాను ఎక్కడున్నా, ఎలా ఉన్నా పక్కన ఉన్నవారినడిగి తెలుసుకుంటారని జాను తెలిపింది. వారు ఏదో ఒక రోజు తిరిగి కలుస్తారని ఆశగా ఎదురుచూస్తున్నా అని తెలిపింది. తన స్నేహితురాలు ప్రేమలో విఫలమై మరణించిందని జాను ఎమోషనల్ అయ్యింది.
ప్రేమలో విఫలమైన వారికి జాను ఒక సందేశం ఇచ్చింది. ప్రేమించమని, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించమని, కానీ ప్రేమ దక్కలేదని ఆత్మహత్య చేసుకోవద్దని ఆమె కోరింది. ఒకవేళ నిజంగా ప్రేమించినట్లయితే, ఆ వ్యక్తి కోసం జీవితాంతం వేచి ఉండాలని, వన్ సైడ్ లవ్ చేసినా తప్పులేదని అభిప్రాయపడ్డారు. ప్రేమ బలవంతంగా వస్తుందని, వేడుకుంటే వస్తుందని భావించవద్దని, అది మనసు నుంచి రావాలని చెప్పారు. నిజమైన ప్రేమ ఎప్పుడూ పక్కనే ఉండాల్సిన అవసరం లేదని, దూరం ఉన్నా ఆ ప్రేమ నిలుస్తుందని అమరన్ చిత్రం ద్వారా తాను నేర్చుకున్నానని జాను తెలిపారు. సాయి పల్లవి అంటే తనకు చాలా ఇష్టమని జాను తెలిపింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.