Bigg Boss 7 Telugu: మొదటి రోజు నామినేషన్స్..శివాజీ సిల్లీ రీజన్స్.. నిలదీసిన రైతుబిడ్డ ప్రశాంత్

బిగ్ బాస్ హౌస్ లో మొదటి రోజు మంచి ఫన్ గా మొదలైంది. హీరో శివాజి హౌస్ లో ఉన్న వారి పై పంచులేసి నవ్వులు పూయిస్తున్నాడు. టేస్టీ తేజ హీరో శివాజీని పెద్దాయన అని పిలవడంతో.. ఎవర్రా నీకు పెద్దాయన.. ఎద్దులా ఉన్నావ్ నీకు నేను పెద్దాయనా అని అన్నారు. దాంతో తేజ సరే చిన్నాయన ఓకేనా అన్నాడు. ఆతర్వాత తేజ శివాజీని బ్రో అని పిలవడంతో ఎవర్రా నీకు బ్రో .. అని అనడంతో తేజకు ఏం అర్ధం కాక మరి ఏమని పిలవాలి అన్నాడు.

Bigg Boss 7 Telugu: మొదటి రోజు నామినేషన్స్..శివాజీ సిల్లీ రీజన్స్.. నిలదీసిన రైతుబిడ్డ ప్రశాంత్
Bigg Boss 7
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 05, 2023 | 10:10 AM

బిగ్ బాస్ 7 లో నామినేషన్స్ పర్వం మొదలైంది. మొదటి రోజే హౌస్ లోకి వెళ్లిన 14 మంది కంటెస్టెంట్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి. బిగ్ బాస్ హౌస్ లో మొదటి రోజు మంచి ఫన్ గా మొదలైంది. హీరో శివాజి హౌస్ లో ఉన్న వారి పై పంచులేసి నవ్వులు పూయిస్తున్నాడు. టేస్టీ తేజ హీరో శివాజీని పెద్దాయన అని పిలవడంతో.. ఎవర్రా నీకు పెద్దాయన.. ఎద్దులా ఉన్నావ్ నీకు నేను పెద్దాయనా అని అన్నారు. దాంతో తేజ సరే చిన్నాయన ఓకేనా అన్నాడు. ఆతర్వాత తేజ శివాజీని బ్రో అని పిలవడంతో ఎవర్రా నీకు బ్రో .. అని అనడంతో తేజకు ఏం అర్ధం కాక మరి ఏమని పిలవాలి అన్నాడు. దానికి శివాజీ నాకు శివన్న అనే పేరుంది. ఆ పేరుతో పిలువు అని సమాధానం ఇచ్చాడు. ఆతర్వాత రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, రతిక  మధ్య మాటలు కలిశాయి. ఇక హౌస్ లోకి వచ్చిన యావర్  బట్టలేకుండా హౌస్ మొత్తం తిరుగుతున్నాడు. ఈ లోగా గౌతమ్ కూడా నేనేమీ తక్కువ కాదు అంటూ షార్ట్ తీసేసాడు.

అమ్మాయిలంతా అతడిని అలా చూస్తూ ఉండిపోయారు. ఇంతలో తేజ బట్టలు తీసుకొని వచ్చి షర్ట్ వేసుకో లేదంటే నేను కూడా షర్ట్ తీసేస్తా తర్వాత నీఇష్టం అని అనడంతో అందరు ఒక్కసారిగా నవ్వేశారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ రతిక, శోభ శెట్టి మధ్య చిన్న వివాదం జరిగింది. ఇక నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టారు బిగ్ బాస్ ముందుగా హీరో శివాజీని పిలిచి హౌస్ లో ఉండటానికి ఏ ఇద్దరు అనర్హులో చెప్పామన్నారు. దానికి శివాజీ దామిని, గౌతమ్ పేర్లు చెప్పాడు. ఆతర్వాత ఆ ఇద్దరినీ పిలిచి శివాజీని ఈ ఇద్దరు ఎందుకు అనర్హులో చెప్పాలన్నారు. దానికి శివాజీ గౌతమ్ యంగ్ పైగా డాక్టర్ ఇక్కడ నుంచి బయటకు వెళ్లిన కూడా అతనికి ఏమి కాదు. అలాగే దామిని మంచి సింగర్ ఆమెను ఎలాగో ఆడియన్స్ సేవ్ చేస్తారు. అందుకే ఈ ఇద్దరినీ నామినేట్ చేస్తున్నా అని చెప్పాడు దానికి బిగ్ బాస్ ఒప్పుకోలేదు. మీరు సరైన కారణాలు చెప్పలేదు అన్నాడు. దాంతో శివాజీ. ఈ ఇద్దరు సరిగ్గా ఎంటర్టైన్ చేయలేకపోతున్నారు అని తెలిపాడు. దానికి బిగ్ బాస్ ఓకే చెప్పాడు.

ఆతర్వాత ప్రియాంక జైన్ రతికా, పల్లవి ప్రశాంత్ ను నామినేట్ చేసింది. దానికి కారణం ఏంటని అడగ్గా.. ఈ ఇద్దరు తనతో క్లోజ్ కాలేకపోయారని అందుకే నామినేట్ చేస్తున్నా అని తెలిపింది. అలాగే పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అనే ప్రస్తావన తెస్తున్నాడు అని తెలిపింది. దాంతో పల్లవి ప్రశాంత్ నేను ఎప్పుడు.? ఎక్కడ .? అన్నాను అని గట్టిగా ప్రశ్నించాడు. దానికి ఆమె సమాధానం చెప్పలేకపోయింది. ప్రియాంక రీజన్స్ తో రతిక కాస్త సీరియస్ అయ్యింది. సరైన కారణం చెప్పుంటే నేను బాధపడేదాన్ని కాదు అని రతిక చెప్పింది. దానికి ప్రియాంక వెళ్లి సారి. నాతో మాట్లాడవా.? అని అడిగింది. దాంతో రతిక వదిలేయ్. ముందుముందు మనం మంచిగా ఉండాలి అంటూ ఓ హగ్ ఇచ్చింది. దాంతో మొదటి రోజు నామినేషన్స్ వీరితో సరిపెట్టుకున్నారు.