Hari Hara Veeramallu: పవర్ స్టార్ మూవీ సెట్‌లో అగ్ని ప్రమాదం.. అర్ధరాత్రి ఎగసిపడ్డ మంటలు

|

May 29, 2023 | 9:42 AM

పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించనున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది.

Hari Hara Veeramallu: పవర్ స్టార్ మూవీ సెట్‌లో అగ్ని ప్రమాదం.. అర్ధరాత్రి ఎగసిపడ్డ మంటలు
Pawan Kalyan
Follow us on

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. వకీల్ సాబ్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన పవన్.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి ఆయా సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. వీటిలో ముందు క్రిష్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించనున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. అలాగే బాలీవుడ్ సీనియర్ నటులు నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది.

ఇదిలా ఉంటే ఈ మూవీ సెట్ లో అగ్ని ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. హైదరాబాద్ దుండిగల్ పరిధిలోని బౌరంపేటలో అర్థరాత్రి సమయంలో సెట్ లో మంటలు ఎగసిపడ్డాయని అక్కడి వారు చెబుతున్నారు. విషయం తెలుసుకుని హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది సెట్‌లో మంటలను అదుపు చేశారు. అయితే వర్షానికి సెట్‌ కూలగా దానికి మరమ్మత్తులు చేసే క్రమంలో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తోంది. కాగా ఎవ్వరి ఎలాంటి గాయాలు కాలేదు. తిరిగి సెట్ నిర్మించి పెండింగ్ చిత్రీకరణను పూర్తి చేయాల్సి ఉంటుంది దాంతో ఈ మూవీ షూటింగ్ కు మరికొంత సమయం పట్టేలా కనిపిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.