Hari Hara Veera Mallu: ఈ ఏడాది ప్రారంభంలో భీమ్లానాయక్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌కు జోష్ తీసుకొచ్చాడు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ (Pawan Kalyan). అదే జోరులో వరుసగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో క్రిష్ జాగర్ల మూడీ దర్శకత్వంలో హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu) కూడా ఒకటి. చాలారోజుల క్రితమే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌కు కరోనాతో బ్రేకులు పడ్డాయి. ఇదే క్రమంలో పవన్ తన రాజకీయ వ్యవహారాల్లో బిజీ కావడంలో ఈ సినిమా ఆగిపోయిందన్న వార్తలు వ్యాపించాయి. దీనికి తోడు సినిమాపై ఎలాంటి అప్‌డేట్స్ రాకపోవడంతో పవర్‌స్టార్ ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు. అయితే తాజాగా హరిహరవీరమల్లు షూటింగ్‌పై ఒక అప్‌డేట్ వచ్చింది. ఆగస్టు మొదటివారంలో ఈ సినిమా షూటింగ్ పునఃప్రారంభంకానుందట. నవంబర్ మొత్తం కల్లా సినిమాను పూర్తి చేసి సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేసుకున్నారట.
కాగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కోసం పవన్ ప్రత్యేక కసరత్తులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, వీడియోలు ఆసక్తిని పెంచాయి. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన బబ్లీ బ్యూటీ నిధి అగర్వాల్ సందడి చేయనుంది. అర్జున్ రామ్‌పాల్, నర్గీస్ ఫక్రి వంటి బాలీవుడ్ తారలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఈ సినిమను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం, దయాకర్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళ్ భాషల్లో విడుదల చేయనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..