టాలీవుడ్(Tollywood)లో ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయంతో సినిమా షూటింగ్ లన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. సినిమా నిర్మాణ వ్యయం పెరిగిపోతోందని బడ్జెట్ తగ్గించుకోవాలని సూచిస్తూ కొద్దిరోజులు సినిమా షూటింగ్స్ ను నిలిపివేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. తాజాగా సినిమా షూటింగ్‌లపై… ఫిలిం ఛాంబర్ కమిటీ కీలక సమావేశం ముగిసింది. ఎగ్జిబిటర్స్ , కార్మికుల వేతనాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు సభ్యులు. డిజిటల్ చార్జీల నియంత్రణకు దర్శకుడు తేజ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఫిలిం చాంబర్స్ కమిటీ.
చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలు పరిష్కారమయ్యే వరకు షూటింగ్‌లు ఆపేద్దామన్న యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యుల అభిప్రాయానికి ఇప్పటికే చలనచిత్ర వాణిజ్య మండలి ఆమోదం తెలిపింది. ఆ మేరకు ఆగస్టు 1నుంచి సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. దీనిపై ఇవాళ భేటీ అయిన ఫిల్మ్ చాంబర్ ప్రత్యేక కమిటీ.. బహు భాషా సినిమాల షూటింగ్‌లపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయంతో సినిమా షూటింగ్‌లన్నీ నిలిచిపోయాయి. సమస్యలన్నింటికీ సంయుక్తంగా పరిష్కారం ఆలోచించిన తరువాత షూటింగ్ తిరిగి పునరుద్దీకరంచే ఆలోచనలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఉంది. అయితే ఈ సమస్యల మధ్య జూనియర్ ఆర్టిస్ట్ ల కష్టాలు మాత్రం ఎవ్వరికీ కనపడ్డంలేదు. అందుకే, వారి వేతనాల పెంపుపైనే ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇక షూటింగ్ ఆగిపోవడంతో బడా సినిమాలన్నీ ఆగిపోయాయి. ఇప్పటికే కరోనా కారణంగా స్టార్ హీరోల సినిమాలన్నీ ఆలస్యంగా రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్ గిల్డ్ తీసుకున్న నిర్ణయంతో స్టార్ హీరోల ఫ్యాన్స్ మరింత నిరాశకు గురవుతున్నారు.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి