Baby: భీమవరంలో బేబీ మూవీ టీమ్ సందడి.. బౌన్సర్లు అత్యుత్సాహం

తక్కువ బడ్జెట్ లో తెరకెక్కి భారీ లాభాలను అందుకుంటున్నాయి చిన్న సినిమాలు.. అలా వచ్చిన సినిమానే బేబీ. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన బేబీ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించాడు. అలాగే వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ఈ ఇద్దరి కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది బేబీ. ఈ మూవీలో నటించిన వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన ఆవరసం లేదు. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఈ చిన్నది.. బేబీ సినిమాతో హీరోయిన్ గా మారిపోయింది.

Baby: భీమవరంలో బేబీ మూవీ టీమ్ సందడి.. బౌన్సర్లు అత్యుత్సాహం
Skn
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 05, 2023 | 9:07 AM

చిన్న సినిమా పెద్ద హిట్స్ అవ్వడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే చాలా సినిమాలు ఊహించని విధంగా సంచలన విజయాలను అందుకున్నాయి. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కి భారీ లాభాలను అందుకుంటున్నాయి చిన్న సినిమాలు.. అలా వచ్చిన సినిమానే బేబీ. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన బేబీ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించాడు. అలాగే వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ఈ ఇద్దరి కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది బేబీ. ఈ మూవీలో నటించిన వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన ఆవరసం లేదు. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఈ చిన్నది.. బేబీ సినిమాతో హీరోయిన్ గా మారిపోయింది. బేబీ సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయి. సినీ ప్రముఖులు కూడా బేబీ సినిమా పై ప్రశంసలు కురిపించారు.

సినిమా విడులై వారాలు గడుస్తున్నా ఈ మూవీ క్రేజ్ మాత్రం తగ్గడంలేదు. ఈ సినిమా తొలి రోజే రూ.7 కోట్లు వరకు వసూల్ చేసింది బేబీ. ఇప్పటికే 85 కోట్ల వరకు రాబట్టి వంద కోట్ల వైపు పరుగులు పెడుతోంది ఈ మూవీ. బేబీ సినిమా విజయం సాధించడంతో బేబీ టీమ్ ప్రమోషన్స్ భారీ ఎత్తున చేస్తోంది. ఇప్పటికే రకరకాల ఈవెంట్స్ చేస్తున్నారు బేబీ టీమ్.

అలాగే థియేటర్స్ ను కూడా విజిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే భీమవరంలో సందడి చేశారు బేబీ చిత్రయూనిట్. బేబీ టీమ్ వసుందని తెలిసి పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. అలాగే మీడియా ప్రతినిధులు కూడా వచ్చారు. అభిమానులు భారీగా రావడంతో బేబీ టీమ్ అత్యుత్సాహం కనబరిచారు. బేబీ నిర్మాత ఎస్‌కేఎన్ మీడియా తో వాగ్వాదానికి దిగారు. అంతే కాదు మీడియాతో దురుసుగా ప్రవర్తించారు. ఎస్‌కేఎన్ బౌన్సర్లు నెట్టివేయడంతో ఓ మీడియా ప్రతినిధికి గాయాలు అయ్యాయి. దాంతో పరిస్థితి ఉదృక్తకరంగా మారింది. ఎస్‌కేఎన్ కారును అడ్డగించి ఆందోళనకు దిగారు మీడియా. కారు దిగిన ఆయన మీడియా ప్రతినిధులుకు క్షమాపణ చెప్పడంతో గొడవ సర్దుమణిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొఇటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.