ఫెమినా మిస్ ఇండియా 2022గా (Femina Miss India World 2022) కర్ణాటకకు చెందిన సినీ శెట్టి (Sini Shetty) నిలిచింది. ఆదివారం జరిగిన 58వ ఫెమినా అందాల పోటీలలో పలు రాష్ట్రాలకు చెందిన 31 మంది ఫైనలిస్టులు పోటీ పడ్డారు. ఇందులో కర్ణాటకకు చెందిన సినీ శెట్టి ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022 టైటిల్ విజేతగా ప్రకటించారు. అనంతరం 2020లో ఫెమినా మిస్ ఇండియాగా నిలిచిన తెలంగాణ అమ్మాయి మానస వారణాసి చేతుల మీదుగా కిరీటం అందుకుంది సినీ శెట్టి. ఈ పోటీలలో రాజస్థాన్‌కు చెందిన రూబల్ షెకావత్ మొదటి రన్నరప్ కాగా.. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన షింటా చౌహాన్ సెకండ్ రన్నరప్ గా నిలిచారు. 6 మంది న్యాయమూర్తుల ప్యానెల్ మధ్య మిస్ ఇండియా 2022 పోటీలు జరిగాయి. బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా, నేహా ధూపియా, డినో మోరియా, రాహుల్ ఖన్నా, రోహిత్ గాంధీ, షమక్ డాబర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. అంతేకాకుండా బాలీవుడ్ ప్రముఖులు.. భారత మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ సైతం ఈ వేడుకలలో పాల్గోన్నారు.
ఈ ఏడాది మిస్ ఇండియా ఫైనల్స్ ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగాయి. ఇందులో మిస్ ఇండియా 2022గా కర్ణాటకకు చెందిన సినీ శెట్టి అందరి మనసులు గెలిచి విజేతగా నిలిచింది. సినీ శెట్టి ప్రస్తుతం చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ (CFA) కోర్సును అభ్యసిస్తుంది. ఆమెకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. చిన్నతనం నుంచే భరతనాట్యం నేర్చుకుంటుంది. నాలుగేళ్ల వయసు నుంచే తాను డ్యాన్స్ నేర్చుకోవడం ప్రారంభించినట్లు తెలిపింది. సినీ శెట్టి ముంబైలో జన్మించింది. కానీ ఆమె స్వస్థలం మాత్రం కర్ణాటక.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.