Faria Abdullah : జాతి రత్నాలు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన టాల్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. తొలి సినిమాతోనే తెలుగు ఆడియన్స్‌కు హాట్ ఫేవరెట్‌గా మారిపోయినా ఈ బ్యూటీ… ఆ ఇమేజ్‌ను బాగానే క్యాష్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ సినిమాలు లేకపోయినా… సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ముఖ్యంగా ఫరియా డ్యాన్స్ వీడియోలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. చేసింది ఒక్క సినిమానే అయినా హీరోయిన్‌గా తన మార్క్ చూపించిన ఫరియా, సోషల్ మీడియా అటెన్షన్ గ్రాబ్ చేయటం ఎలాగో కూడా చాలా త్వరగానే తెలుసుకున్నారు. అందుకే జాతిరత్నాలు మెమొరీస్‌తో పాటు… ట్రెండీ ఫోటోషూట్స్, డ్యాన్స్ వీడియోస్‌ను షేర్ చేస్తూ డిజిటల్ ఫాలోవర్స్‌ను ఎంగేజ్ చేస్తున్నారు. మొదటి సినిమాతోనే గ్లామర్ పరంగానే కాకుండా నటనతోను మంచి మార్కులు కొట్టేసింది ఫరియా అబ్దుల్లా. ఇప్పుడు ఈ అమ్మడికి టాలీవుడ్ లో ఆఫర్లు క్యూకడుతున్నాయి. మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ఓ సినిమాలో ఇప్పటికే ఫరియా అబ్దుల్లా ఎంపిక అయ్యిందని తెలుస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తనకు సైకోగా నటించాలని కోరిక ఉందని తెలిపింది ఫరియా. అలాంటి పాత్రలో నటించినప్పుడు మనలోని నటన బయటకు వస్తుంది. మన ప్రతిభ పూర్తిగా బయటకు తీసేందుకు అలాంటి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను చేయాలని చెప్పుకొచ్చింది ఈ లేడీ జాతిరత్నం.
సినిమాల విషయంలోనూ సెలెక్టివ్‌గా ఉంటున్నారు ఫరియా. ఫస్ట్ మూవీ సూపర్ హిట్ అయినా.. హరీబరీగా సినిమాలు ఓకే చేయకుండా.. స్లో అండ్ స్టడీ సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. ప్రజెంట్ తన ఫస్ట్ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ.. త్వరలోనే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి క్లారిటీ ఇస్తారట.
మరిన్ని ఇక్కడ చదవండి :