Vakeel Saab: పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులు.. మరి కొద్దిరోజుల్లో..

|

Mar 28, 2021 | 3:16 PM

వకీల్ సాబ్‌ ఇంకో రోజులో.. మన ముందుకు రాబోతున్నాడు. తన ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేందుకు.. అదిరిపోయే ట్రైలర్‌ను వదులుతున్నాడు. అవును పవర్ స్టార్‌ పవన్‌ కల్యాణ్ మోస్ట్‌ అవేటెడ్‌ మూవీ.. వకీల్ సాబ్‌.

Vakeel Saab: పవర్ స్టార్ వకీల్ సాబ్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులు.. మరి కొద్దిరోజుల్లో..
Pawan Kalyan
Follow us on

Vakeel Saab: వకీల్ సాబ్‌ ఇంకో రోజులో.. మన ముందుకు రాబోతున్నాడు. తన ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేందుకు.. అదిరిపోయే ట్రైలర్‌ను వదులుతున్నాడు. అవును పవర్ స్టార్‌ పవన్‌ కల్యాణ్ మోస్ట్‌ అవేటెడ్‌ మూవీ.. వకీల్ సాబ్‌. ఇప్పుడీ ట్రైలర్‌ ఇంకో రోజులో అంటే.. మార్చ్‌ 29 సాయంత్రం 6 గంటలకు రిలీజ్‌ కాబోతుంది.

ఇప్పటికే ఈ విషయాన్ని పోస్టర్‌ రిలీజ్‌ చేసిమరి చెప్పేసిన ఈ చిత్ర బృందం.. తమ సోషల్ మీడియా అకౌంట్‌లలో ట్రైలర్‌ కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ చేసి.. ట్రైలర్‌ పై అంచనాలను పెంచుతుంది. అర్థరాత్రి కూడా ఆడవాళ్లు స్వేచ్ఛగా తిరగాలి.. ఇదీ వకీల్‌సాబ్‌ మూవీకి సెంట్రల్‌ థీమ్. పక్కా కమర్షియల్ హీరో పవన్‌కల్యాణ్‌ ఇటువంటి థీమ్‌ని ఎలా పిక్ చేసుకున్నారు. పైగా.. రీఎంట్రీ కోసం..? ఇదే కదా మీ డౌట్. పవర్‌స్టార్ దగ్గరైతే దీనికి కరెక్ట్ ఆన్సరుంది. ఆడపిల్లలు-ఆత్మాభిమానం.. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. ఈ విషయం తనకు చిన్నప్పుడే తెలిసొచ్చింది అని ఓపెన్ డయాస్ మీదే చెప్పారు పవన్‌. ఇక ఈ సినిమా పింక్ రిమేక్‌గా శ్రీరామ్‌ వేణు డైరెక్షన్లో తెరకెక్కుతుంది. సెన్సబుల్ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్‌, నివేదా థామస్‌, అంజలి, అనన్య నాగళ్ల ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి . 

Tollywood Actor: రంగుల్లో మునిగిన టాలీవుడ్ సీతాకోక చిలకలు.. హోలీ సంబరాల్లో ముద్దుగుమ్మలు

Toofaan Movie: ప్రొఫెషనల్‌ బాక్సర్లతో తలపడనున్న ఫర్హాన్ అక్తర్.. ‘తుఫాన్’ కోసం సహజ సిద్ధమైన స్టంట్స్..