కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత లాక్ డౌన్ సమయంలో ఆపన్నుల కోసం నేనున్నానంటూ బాలీవుడ్ నటుడు సోనూసూద్ ముందుకొచ్చాడు. కార్మికులకు, బాధితులకు అండగా నిలబడి కలియుగ దాన కర్ణుడుగా ఖ్యాతిగాంచాడు. మహమ్మారి సమయంలో పేద ప్రజలకు సహాయం చేయడం మొదలు పెట్టిన సోనూ సూద్.. ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు. సోనూ సూద్ చేసే సహాయాలతో సోషల్ మీడియాలో రియల్ హీరోగా అభిమానులను సంపాదించుకున్నాడు.
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా సోనూ తరచుగా మాట్లాడుతూ ఉంటారు. తాజాగా సోనూ సూద్ ASK సోను సెషన్‌ను ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేశారు. తన ఫ్యాన్స్ అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. వాటిల్లో సినిమాల గురించి విదేశీ పౌరసత్వం గురించి ఇలా అనేక విషయాలపై సోనూ తన అభిప్రాయాన్ని అందరికీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ज़िंदगी फ़िल्मों से बहुत ऊपर है मेरे दोस्त।
हिंदुस्तान से बेहतर कोई नहीं। 🇮🇳 https://t.co/xgY3EfXG5H— sonu sood (@SonuSood) June 26, 2023
సినిమా ఫ్లాప్ అయితే కెనడా పౌరసత్వం తీసుకుంటారా?
సోనూ సూద్‌ను ఒక అభిమాని భవిష్యత్ లో ఎప్పుడైనా మీ సినిమాలు ప్లాప్ అయితే మీరు కెనడా పౌరసత్వం తీసుకుంటారా అని అడిగిన ప్రశ్నకు సోనూ తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు. సినిమాల కంటే జీవితం చాలా ఉన్నతమైనదని.. భారతదేశాన్ని మించిన దేశం ప్రపంచంలో ఎక్కడా ఉండదని చెప్పారు. అంతేకాదు తాను దేవుడిని కాదని తాను కూడా సాధారణ మనిషిని అని అయితే దేశంలోని సామాన్యులతో కనెక్ట్ అవ్వడానికి తాను ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
I am just a common man trying to connect rest of the common men of our country 🇮🇳 https://t.co/UFSW2OGP0s
— sonu sood (@SonuSood) June 26, 2023
అంతేకాదు ఒక నెటిజన్ తనకు ఇంట్లో బుల్లెట్ ఇవ్వడం లేదని.. ప్లీజ్ మీరు నాకు ఒక బైక్ కొనివ్వమని అడగగా.. సోనూ చాలా ఫన్నీగా స్పందించారు.. ఇప్పుడు బైక్ అడుగుతున్నారు.. తర్వాత పెట్రోల్ కోసం డబ్బులు అడుగుతారని సమాధానం చెప్పారు సోనూ..
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..