గేయ రచయిత శివ గణేశ్‌ ఇకలేరు! గుండెపోటుతో మృతి

హైదరాబాద్‌: ప్రముఖ సినీ గేయ రచయిత శివగణేశ్‌ హఠాన్మరణం చెందారు. వనస్థలిపురంలోని నివాసంలో బుధవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. శివ గణేశ్ వెయ్యికిపైగా సినిమాలకు పాటలు రాశారు. ‘నర్సింహ’, ‘జీన్స్‌’, ‘బాయ్స్‌’,  ‘ప్రేమికులరోజు’ తదితర చిత్రాల కోసం పనిచేశారు. సౌత్ ఇండియన్ స్టార్ డైరక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన సినిమాలకు అయన రాసిన పాటలు ప్రసిద్ధి చెందాయి.  శివగణేశ్‌కు భార్య నాగేంద్రమణి, కుమారులు సుహాస్‌, మానస్‌ ఉన్నారు. తెలుగుతో పాటు పలు తమిళ సినిమాలకు కూడా […]

గేయ రచయిత శివ గణేశ్‌ ఇకలేరు! గుండెపోటుతో మృతి
Shiva Ganesh Died

Updated on: Aug 15, 2019 | 3:09 PM

హైదరాబాద్‌: ప్రముఖ సినీ గేయ రచయిత శివగణేశ్‌ హఠాన్మరణం చెందారు. వనస్థలిపురంలోని నివాసంలో బుధవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. శివ గణేశ్ వెయ్యికిపైగా సినిమాలకు పాటలు రాశారు. ‘నర్సింహ’, ‘జీన్స్‌’, ‘బాయ్స్‌’,  ‘ప్రేమికులరోజు’ తదితర చిత్రాల కోసం పనిచేశారు. సౌత్ ఇండియన్ స్టార్ డైరక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన సినిమాలకు అయన రాసిన పాటలు ప్రసిద్ధి చెందాయి.  శివగణేశ్‌కు భార్య నాగేంద్రమణి, కుమారులు సుహాస్‌, మానస్‌ ఉన్నారు. తెలుగుతో పాటు పలు తమిళ సినిమాలకు కూడా ఆయన పనిచేశారు. ఇటీవల వింక్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ లీడ్ రోల్‌లో నటించిన ‘లవర్స్ డే’ చిత్రంలోనూ ఆయన స్నేహానికి సంబంధించిన మంచి సాంగ్ రాసి శ్రోతల మనసులను దోచుకున్నారు.