టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి జీవిత కథ పై మోడ్రన్ మాస్టర్స్ పేరుతో ఓ డాక్యుమెంటరీ రిలీజైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతోంది. గత వారం స్ట్రీమింగ్ కు వచ్చేసిన మోడ్రన్ మాస్టర్స్ డాక్యుమెంటరీ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో నిలిచింది. బాలీవుడ్ లో పలు సినిమాలు, చాలా టీవీ షోలు నిర్మించిన సంస్థ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్, ఫిలిం కంపానియన్ స్టూడియోస్ నిర్మాణ సంస్థలు కలిసి సంయుక్తంగా రాజమౌళి డాక్యుమెంటరీని తెరకెక్కించారు. రాఘవ్ కన్నా దర్శకత్వం వహించారు. ఇక ఈ మోడ్రన్ మాస్టర్స్ డాక్యుమెంటరీలో రాజమౌళి జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు, విశేషాలు చాలా ఉన్నాయి. బాల్యం నుండి నేటి వరకు ఆయన ప్రయాణం గురించి తెలుసుకోవడానికి ‘మోడరన్ మాస్టర్స్’ డాక్యుమెంటరీ బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రాజమౌళి బాల్యం, ప్రేమ, పెళ్లి గురించి, రాజమౌళి కెరీర్ ఆరంభం, ఆ తర్వాత రాజమౌళి సినిమాల గురించి చర్చించారు. రాజమౌళి గురించే ఆయన మాత్రమే చెప్పడమే కాకుండా రాజమౌళి ఫ్యామిలీ మెంబర్స్ కీరవాణి, రమా రాజమౌళి, కార్తికేయ, కాంచి, విజయేంద్రప్రసాద్ తో పాటు ఎన్టీఆర్, ప్రభాస్, రానా, రామ్ చరణ్, హాలీవుడ్ డైరెక్టర్స్ జేమ్స్ కామెరూన్, జో రసో.. ఇలా అనేకమంది సెలబ్రిటీలు రాజమౌళి గురించి పలు ఆసక్తికర విషయాలను ఈ డాక్యుమెంటరీలో పంచుకున్నారు.
రాజమౌళి ఎంతో మంది దర్శకులకు స్ఫూర్తిగా నిలిచారు. భారతీయ సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అతి కేవలం రాజమౌళి ఒక్కరే అని చెప్పడంలో ఎలాంటి అతి శయోక్తి లేదు. తొలినాళ్లలో రాజమౌళి యువ దర్శకుడిగా ఎలా గుర్తింపు పొందాడు అనే సమాచారం కూడా ఈ డాక్యుమెంటరీలో ఉంది. అలాగే మిగతా వారితో పోలిస్తే రాజమౌళి సినిమాలు లావిష్ గా ఉంటాయి. భారీ సెట్లు, కళ్లు చెదిరే గ్రాఫిక్స్, యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. వాటి గురించి కూడా ఎస్.ఎస్. రాజమౌళి ఈ డాక్యుమెంటరీలో మాట్లాడారు. రాజమౌళి ఇప్పుడు తెలుగు సినిమాకే పరిమితం కాలేదు. భారతీయ సినిమా హద్దులు దాటి ప్రపంచ స్థాయిలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని ‘నాటు నాటు..’ పాటకు ‘ఆస్కార్’ అవార్డు రావడంతో రాజమౌళి క్రేజ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లింది.
A master of his craft, a cinema phenomenon. Watch director S. S. Rajamouli’s journey from Student No. 1 to RRR 🎥🎬
Modern Masters: S.S. Rajamouli, coming on 2 August, only on Netflix!#ModernMastersOnNetflix pic.twitter.com/VRmvVJwDiN— Netflix India (@NetflixIndia) July 22, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.