Bigg Boss Telugu 7: బిగ్ బాస్ గేమ్ షో పై ఆది రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అవేమీ ఉండవంటూ..

బిగ్ బాస్ పై ఇప్పటికే చాలా వివాదాలు, విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. కొంతమంది బిగ్ బాస్ పై షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు. మరికొంతమంది బిగ్ బాస్ ని నిలిపివేయాలని కోర్టులను కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆది రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆదిరెడ్డి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఓ సామాన్యుడు. తనదైన ఆట తీరుతో బిగ్ బాస్ లో టాప్ త్రీ కంటెస్టెంట్ గా బయటకు వచ్చాడు ఆది రెడ్డి. 

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ గేమ్ షో పై ఆది రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అవేమీ ఉండవంటూ..
Big Boss7

Edited By:

Updated on: Aug 09, 2023 | 6:42 PM

బిగ్ బాస్ సీజన్ 7 త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆరు సీజన్స్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు రెట్టింపు వినోదం తో సీజన్ 7తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. ఈ సీజన్ కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు. అయితే బిగ్ బాస్ పై ఇప్పటికే చాలా వివాదాలు, విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. కొంతమంది బిగ్ బాస్ పై షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు. మరికొంతమంది బిగ్ బాస్ ని నిలిపివేయాలని కోర్టులను కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆది రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆదిరెడ్డి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఓ సామాన్యుడు. తనదైన ఆట తీరుతో బిగ్ బాస్ లో టాప్ త్రీ కంటెస్టెంట్ గా బయటకు వచ్చాడు ఆది రెడ్డి.

బిగ్ బాస్ తో వచ్చిన ఫెమ్ తో ఆ తర్వాత పలు బుల్లి తేర షోల్లో సందడి చేశాడు. ప్రస్తుతం తన సొంత యూట్యూబ్ ఛానెల్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఆది రెడ్డి బిగ్ బాస్ గేమ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ షోను నిలిపివేయాలని యాజమాన్యానికి, నాగార్జునకు నోటీసులు వచ్చిన విషయం పై స్పందిస్తూ..

బిగ్ బాస్ గేమ్ షో లో ఎలాంటి వల్గారిటీ లేదు అని తెలిపాడు ఆదిరెడ్డి. నిజం చెప్పాలంటే సినిమాల్లో, ఓటీటీ వెబ్ సిరీస్ లు, కొన్ని కామెడీ షోలలో ఉండే వల్గారిటీ తో పోల్చుకుంటే బిగ్ బాస్ లో అంత వల్గారిటీ లేదని తెలిపాడు ఆదిరెడ్డి. ఆడియన్స్ ఇష్టం ఉంటే బిగ్ బాస్ చూస్తారు లేదంటే చూడరు అంటూ తన అభిప్రాయాన్ని తెలిపాడు ఆదిరెడ్డి.