Tollywood: ఆ హీరో లేకపోతే కుటుంబంతో సహా చచ్చిపోయే వాడిని.. కంటతడి పెట్టిన సిసిరోలియో

ఓ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో రవితేజపై తన ప్రేమను వ్యక్తం చేశాడు. తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు రవితేజ తనకు అవకాశం ఇచ్చి, తన కుటుంబాన్ని నిలబెట్టారని భావోద్వేగానికి లోనయ్యారు. ఆ డీటేల్స్ ఈ కథనంలో తెలుసుకుందాం..

Tollywood: ఆ హీరో లేకపోతే కుటుంబంతో సహా చచ్చిపోయే వాడిని.. కంటతడి పెట్టిన సిసిరోలియో
Bheems Ceciroleo

Updated on: Jan 14, 2026 | 4:29 PM

గతంలో మాస్ జాతర ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో చేసిన భావోద్వేగ ప్రసంగం అందర్నీ కదిలించింది. తన సినీ ప్రస్థానంలో రవితేజ కీలక పాత్ర పోషించారని, ఆయన కేవలం ఒక వ్యక్తి కాదని, ఒక వ్యవస్థ అని భీమ్స్ అభివర్ణించారు. ధమాకా చిత్రం నుంచి ప్రస్తుత చిరంజీవి సినిమా వరకు తాను పనిచేసిన ప్రతి పాట వెనుక, తనకు లభించిన ప్రతి ప్రోత్సాహం వెనుక రవితేజ నిలబడ్డారని ఆయన పేర్కొన్నారు. భీమ్స్ తన గతాన్ని గుర్తు చేసుకుంటూ, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పోషణ, పిల్లల చదువుల విషయంలో నిస్సహాయ స్థితిలో ఉన్న రోజులను వివరించారు. ఇంటి అద్దె కట్టలేక, భార్యాపిల్లలతో సహా జీవితాన్ని ముగించుకోవాలని అనుకుంటున్న సమయంలో, పీపుల్స్ మీడియా సంస్థ నుండి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, అది తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందని తెలిపారు. “మీరు భీమ్స్ సిసిరోలియోనా?” అని అడిగినప్పుడు, ఆ పెద్ద సంస్థ నుంచి పిలుపు అదృష్టంగా భావించానని చెప్పారు. ఆ కాల్ చేయించింది రవితేజ అని.. అప్పుడు ఆయన ఒక దేవుడిలా, జీసస్, అల్లా, రాముడు, తిరుపతి వెంకటేశ్వర స్వామిలా తన కోసం ప్రత్యక్షమయ్యారని, తనను, తన కుటుంబాన్ని రక్షించారని భావోద్వేగానికి లోనయ్యారు.

“నేను నా రెండు కాళ్ల మీద నిలబడి ఉన్నాను, ఐదు వేళ్లతో తింటున్నాను అంటే రవితేజ సార్ కారణం. అమ్మ, నాన్న, నీ కొడుకు సజీవంగా ఉండడానికి రవితేజ్ కారణం” అని భీమ్స్ ఎమోషనల్ అయ్యారు. రవితేజ పట్ల తనకున్న అపారమైన ప్రేమను, కృతజ్ఞతను మాటల్లో కాకుండా సంగీతం ద్వారానే వ్యక్తపరుస్తానని, మాటల్లో చెబితే అది సమాధానం అవుతుందని, కానీ పాటల్లో చెబితే చరిత్రలో నిలిచిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రవితేజ తనలాంటి ఎంతో మంది కొత్త ప్రతిభకు అవకాశాలు కల్పించి, వారిని నిలబెడుతున్నారని, సమాజంలో వారందరికీ పేరు ప్రఖ్యాతులు వచ్చేందుకు తోడ్పడుతున్నారని అన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..