Sita Ramam: కలెక్షనల్లో కొత్త రికార్డులు సృష్టిస్తోన్న సీతారామం.. యూఎస్‌లో మిలియన్‌ డాలర్స్‌కు పైగానే వసూళ్లు

|

Aug 15, 2022 | 9:09 AM

Sita Ramam Collections: మహానటి తర్వాత మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌(Dulquer Salman) తెలుగులో నేరుగా నటించిన చిత్రం సీతారామం. బాలీవుడ్‌ బ్యూటీ మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) సీత పాత్రలో సందడి చేసింది.

Sita Ramam: కలెక్షనల్లో కొత్త రికార్డులు సృష్టిస్తోన్న సీతారామం.. యూఎస్‌లో మిలియన్‌ డాలర్స్‌కు పైగానే వసూళ్లు
Sitaramam
Follow us on

Sita Ramam Collections: మహానటి తర్వాత మలయాళ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌(Dulquer Salman) తెలుగులో నేరుగా నటించిన చిత్రం సీతారామం. బాలీవుడ్‌ బ్యూటీ మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) సీత పాత్రలో సందడి చేసింది. ప్రతిష్ఠాత్మక వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ నిర్మాణంలో, హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ ఎపిక్‌ లవ్‌స్టోరీ సూపర్‌హిట్‌గా నిలిచింది. దుల్కర్‌, మృణాళ్‌ల సహజ నటనకు తోడు, హను రాఘవపూడి టేకింగ్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. ఆగస్టు 5 న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది. కేవలం ఇండియాలోనే కాకుండా యూఎస్‌లోనూ రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తోంది. ఇక ఈ సినిమాలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మంధాన కీలక పాత్రలో కనిపించగా, అక్కినేని సుమంత్‌ బ్రిగేడియ‌ర్ విష్ణు పాత్రలో మెప్పించాడు. డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌, భూమికా చావ్లా, ప్రకాశ్‌ రాజ్‌ తదితరులు తమ నటనతో మెప్పించారు. ఇక ఈ సినిమాకు విశాల్‌ చంద్రశేఖర్‌ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

తాజాగా సీతారామం సినిమా యూఎస్‌లో 1 మిలియన్ డాలర్స్‌కు పైగానే కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ ఈ సినిమా కలెక్షన్లు పెరుగుతున్నాయి. కొత్త సినిమాలు విడుదలవుతున్నా.. హౌస్‌ఫుల్‌ షోలతో నడుస్తోంది. గల్ఫ్‌ దేశాల్లోనూ సినిమా విడుదల కావడం, థియేటర్ల సంఖ్య పెరుగుతుండడంతో లాంగ్‌ రన్‌లో ఈ సినిమా మరిన్ని వసూళ్లు రాబట్టుతుందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..