AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

𝗧𝗶𝗴𝗲𝗿 𝗡𝗮𝗴𝗲𝘀𝘄𝗮𝗿𝗮 𝗥𝗮𝗼 : టైగర్ నాగేశ్వరరావు సినిమానుంచి ఆ సీన్స్ తొలగింపు.. కారణం ఇదేనా

స్టువర్ట్ పురంలోని గజదొంగ నాగేశ్వరరావు జీవిత కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. వాస్తవిక ఘటనల ఆధారంగా ఈ సినిమా కథను రచించాడు దర్శకుడు వంశీ. ఇక ఈ మూవీలో రవితేజకు జోడీగా నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించారు.  ఇక ఈ సినిమాతో రవితేజ మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. ఇదిలా ఉంటే టైగర్ నాగేశ్వరరావు సినిమాతో తొలిసారి పాన్ ఇండియా వరల్డ్ లోకి అడుగు పెట్టారు మాస్ రాజా.

𝗧𝗶𝗴𝗲𝗿 𝗡𝗮𝗴𝗲𝘀𝘄𝗮𝗿𝗮 𝗥𝗮𝗼 : టైగర్ నాగేశ్వరరావు సినిమానుంచి ఆ సీన్స్ తొలగింపు.. కారణం ఇదేనా
Tiger Nageswara Rao collections
Rajeev Rayala
|

Updated on: Oct 22, 2023 | 11:24 AM

Share

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమా అక్టోబర్ 20న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. స్టువర్ట్ పురంలోని గజదొంగ నాగేశ్వరరావు జీవిత కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. వాస్తవిక ఘటనల ఆధారంగా ఈ సినిమా కథను రచించాడు దర్శకుడు వంశీ. ఇక ఈ మూవీలో రవితేజకు జోడీగా నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించారు.  ఇక ఈ సినిమాతో రవితేజ మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. ఇదిలా ఉంటే టైగర్ నాగేశ్వరరావు సినిమాతో తొలిసారి పాన్ ఇండియా వరల్డ్ లోకి అడుగు పెట్టారు మాస్ రాజా. సినిమాను కాస్త గట్టిగానే ప్రమోట్ చేసుకున్నారు రవితేజ ఇక ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది .

టైగర్ నాగేశ్వరరావు సినిమాకు కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా నుంచి కొన్ని సీన్స్ ను తొలగించారు. టైగర్ నాగేశ్వరరావు సినిమా సెకండ్ ఆఫ్ లో ల్యాగ్ ఎక్కువైంది అన్న టాక్ వినిపించింది. బయోపిక్ కావడంతో కథను వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు. దాంతో సెకండ్ ఆఫ్ లో ల్యాగ్ ఎక్కువైంది అని అంటున్నారు చూసిన ప్రేక్షకులు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో దాదాపు 15 నిమిషాల సన్నివేశాలను తొలగించారు. సినిమాకు మంచి టాక్ రావడంతో సెకండ్ ఆఫ్ లో అనవసర సన్నివేశాలను తొలగించారని తెలుస్తోంది. ముందు ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 52 నిమిషాలు ఉంది. ఇక ఇప్పుడు రన్ టైం 2 గంటల 37 నిమిషాలు చేశారు. దసరా సెలవలు ఈ సినిమా బాగా కలిసొస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా మంచి ఓపినింగ్స్ ను సొంతం చేసుకుంది.

టైగర్ నాగేశ్వరరావు

మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..