AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ హౌస్‌లో దసరా సెలబ్రేషన్.. చివరిలో ఊహించని ట్విస్ట్

అశ్విని .. గౌతమ్- శోభా, గౌతమ్.. అర్జున్-శివాజీ, శివాజీ.. యవర్- అమరదీప్, అమరదీప్.. అర్జున్- తేజ, అర్జున్.. గౌతమ్-శివాజీ, యవర్.. శివాజీ- గౌతమ్, పూజా.. అర్జున్- అశ్విని, ప్రియాంక.. శోభా- అశ్విని,భోలె.. శివాజీ- శోభాశెట్టి,  శోభాశెట్టి.. ప్రియాంక- భోలె, సందీప్.. శోభా- శివాజీ, తేజ.. అమరదీప్- యవర్, ప్రశాంత్.. శివాజీ- పూజా అని చెప్పుకొచ్చారు. ఇక నేటి ఎపిసోడ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు.

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ హౌస్‌లో దసరా సెలబ్రేషన్.. చివరిలో ఊహించని ట్విస్ట్
Bigg Boss 7 Telugu.
Rajeev Rayala
|

Updated on: Oct 22, 2023 | 10:44 AM

Share

నిన్న శనివారం కావడంతో కింగ్ నాగార్జున హౌస్ లో ఉన్న వారికి క్లాస్ తీసుకున్నారు వారం మొత్తం లో జరిగిన విషయాలు గురించి మాట్లాడుతూ.. క్లాస్ తీసుకున్నాడు. అలాగే హౌస్ లో ఎవరు ఎవరికీ నిచ్చెన, పాము అని ఓ గేమ్ ఆడించారు నాగార్జున. ఇందులో ఒకొక్కరు తమకు సపోర్ట్ చేసే వారిని నిచ్చెన అని.. నచ్చని వారిని పాము అని అందుకు రీజన్స్ కూడా చెప్పాలని చెప్పాడు నాగ్. అశ్విని .. గౌతమ్- శోభా, గౌతమ్.. అర్జున్-శివాజీ, శివాజీ.. యవర్- అమరదీప్, అమరదీప్.. అర్జున్- తేజ, అర్జున్.. గౌతమ్-శివాజీ, యవర్.. శివాజీ- గౌతమ్, పూజా.. అర్జున్- అశ్విని, ప్రియాంక.. శోభా- అశ్విని,భోలె.. శివాజీ- శోభాశెట్టి,  శోభాశెట్టి.. ప్రియాంక- భోలె, సందీప్.. శోభా- శివాజీ, తేజ.. అమరదీప్- యవర్, ప్రశాంత్.. శివాజీ- పూజా అని చెప్పుకొచ్చారు. ఇక నేటి ఎపిసోడ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు.

బిగ్ బాస్ హౌస్ లో దసరా సంబురాలు జరిగాయి. దసరా సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లో అందరు బతుకమ్మ ఆడారు. ఇక నాగ్ కొంతమంది సెలబ్రెటీలతో డాన్స్ పర్ఫామెన్స్ చేయించాడు. హీరోయిన్స్ డింపుల్ హయతి, పాయల్ రాజ్ పుత్ తమ డాన్స్ లతో ఆకట్టుకున్నారు.

ఇక హౌస్ లో ఉన్న వారితో గేమ్స్ ఆడించాడు నాగ్. అలాగే హౌస్ లో ఉన్న వారికి తన ఇంటివారు రాసిన లెటర్స్ ను పంపించారు. ఈ లెటర్స్ చదువుతూ అందరూ ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా శోభా శెట్టి, తేజ, యావర్ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక లాస్ట్ లో అసలైన ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. గతవారం హౌస్ లో ఉన్నవారు తిరిగి హౌస్ లోకి ఎవరు రావాలనుకుంటున్నారు అని ఓ ఓటింగ్ పెట్టిన విషయం తెలిసిందే. ఎవరికైతే తక్కువ ఓట్లు పడ్డాయో వాళ్లు హౌస్ లో వచ్చారు. అయితే రతికా హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చిందని తెలుస్తోంది. అలాగే ఈ వారం ఎలిమినేషన్ లో భాగంగా పూజామూర్తి హౌస్ నుంచి బయటకు వెళ్లనుంది.

మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..