Double ISMART Trailer : దిమాక్ ఖరాబ్ ట్రైలర్.. దుమ్మురేపిన డబుల్ ఇస్మార్ట్..

|

Aug 05, 2024 | 7:58 AM

పూరి సినిమాలను యూత్‌ను కట్టిపడేసే కాన్సెప్ట్ డైలాగ్స్ తో ఉంటాయి. ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు. రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రామ్ తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

Double ISMART Trailer : దిమాక్ ఖరాబ్ ట్రైలర్.. దుమ్మురేపిన డబుల్ ఇస్మార్ట్..
Double Ismart
Follow us on

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చే సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా యూత్ ఆయన సినిమాలకు బాగా కనెక్ట్ అవుతారు. పూరి సినిమాలను యూత్‌ను కట్టిపడేసే కాన్సెప్ట్ డైలాగ్స్ తో ఉంటాయి. ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు. రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రామ్ తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్ బాగా పేలాయి. రామ్ యాక్టింగ్ తో పాటు హీరోయిన్స్ అందచందాలు కూడా ఈ సినిమాలు ప్లస్ అయ్యాయి. మొత్తంగా ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ రానుంది.

పూరి దర్శకత్వంలో మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నాడు రామ్ పోతినేని. డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ , టీజర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో రామ్ కు జోడీగా కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే డబుల్ ఇస్మార్ట్ కు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ మూవీని పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్‌పై నిర్మించారు. చార్మితో క‌లిసి పూరి జ‌గ‌న్నాథ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

తాజాగా డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ ను విడుదల చేశారు . ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. మరోసారి రామ్ తన మాస్ యాక్టింగ్ తో ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. ఇక ఈ మూవీ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇస్మార్ట్ శంకర్ కంటే ఈ సినిమాలో మరింత యాక్షన్ ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. ఇక ఈ ట్రైలర్ చివరిలో ఫైట్ సీక్వెన్స్ చూపించారు. బహుశా అదే ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ అయ్యుండొచ్చు. వీటితో పాటు కావ్య తన అందాలతో ఆడియన్స్ ను చూపుతిప్పుకోకుండా చేసేసింది. ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.