
రీసెంట్ డేస్ లో ఓటీటీల్లో సినిమాలు చూడటాన్ని అభిమానులు ఉత్సహం చూపిస్తున్నారు. థియేటర్స్ లో ప్రతివారం కొత్త సినిమాలు విడుదలవుతున్నా.. ఓటీటీలో రీపీటెడ్ గా సినిమాలు చూడటానికి ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. కొత్త సినిమాలు కూడా నెల రోజులు తిరగకముందే ఓటీటీ బాట పడుతున్నాయి. ఇక ఓటీటీలో ట్రెండింగ్ లో ఉండే సినిమాల్లో హారర్, బోల్డ్, థ్రిల్లర్ సినిమాలే ముందు వరసలో ఉంటాయి. ఇక థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా ఓటీటీలో హవా చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తుంది. ఈ థ్రిల్లర్ సినిమాలో ఓ మాయ లేడీ మగాళ్లను ట్రాప్ చేసి ప్రగ్నెన్సీ తెచ్చుకుంటుంది. ఈ సినిమాలో సీన్ సీన్ కు ఊహించని ట్విస్ట్ లు ఉంటాయి. ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది ఈ సినిమా.. ఇంతకూ ఈ సినిమా కథ ఏంటంటే..
ఈ సినిమా ఒక యువకుడి చుట్టూ తిరుగుతుంది, అతను ఎడారిలో చిక్కుకుంటాడు మరియు అక్కడ ఒక మహిళతో కలుస్తాడు. ఆమెతో గడిపిన సమయం అతని జీవితాన్ని మలుపు తిప్పే విధంగా మారుతుంది. కథలో భయానక మరియు మానసిక థ్రిల్లర్ అంశాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఓ యువకుడు ఫోటోగ్రాఫర్ అతను ఎడారిలో తిరుగుతూ ఉంటాడు.. అతనికి ఓ చిన్న పిల్లోడు కలుస్తాడు.. తన తల్లి తండ్రులు కనిపించడం లేదు అని చెప్తాడు. దాంతో ఇద్దరూ కలిసి వెతుకుతుండగా ఆ పిల్లడు కూడా కనిపించకుండా పోతాడు. ఆ తర్వాత ఓ అమ్మాయి కలుస్తుంది.
ఆతర్వాత ఆ అమ్మాయి, అబ్బాయి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆతర్వాత ఆ అమ్మాయి గర్భవతి అవుతుంది. దాంతో సినిమా అంతా ఊహించని ట్విస్ట్ ఉంటుంది. అబ్బాయిలను ట్రాప్ చేసి అమ్మాయిలను గర్భవతులు చేస్తున్నారని అతను తెలుసుకుంటాడు. ఆతర్వాత సినిమా మలుపు తిరుగుతుంది. అక్కడి నుంచి కథ ఎటు వెళ్తుంది..? ఆ ఫోటోగ్రాఫర్ బయట పడ్డాడా లేదా అన్నది సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఈ సినిమా పేరు “ది సీడింగ్ “. ఈ సినిమా ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీతో పాటు ఇంగ్లీష్‌లోనూ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.