
ఓటీటీలో చాలా రకాల సినిమాలు అందుబాటులో ఉన్నాయి. థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు నెలరోజులకు ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. అభిమానుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని దర్శకులు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే చాలా జోనర్స్ లో సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇతరభాషల్లోనూ రిలీజ్ అయిన సినిమాలు కూడా ఓటీటీలో డబ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక అభిమానులను ఆకట్టుకుంటున్న జోనర్స్ లో రొమాంటిక్ మూవీస్ కూడా ఉన్నాయి. రొమాంటిక్ సినిమాలకు ఓటీటీలో మంచి క్రేజ్ ఉంది. అలాంటి రొమాంటిక్ సినిమానే ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ఈ సినిమాలో ఘాటైన సన్నివేశాలు కూడా ఎక్కువే.
ఇక ఇప్పుడు ఈ రొమాంటిక్ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు. రెగ్యులర్ గా మనం న్యూస్ లో చూస్తూనే ఉన్నాం పెళ్లి చేసుకున్న తర్వాత భార్య మరొకరితో సంబంధం పెట్టుకోవడం అది తెలిసిన భర్త ఆమెను చంపడం లేదా అతను చనిపోవడం ఇలా చాలా రకాల వార్తలు చూస్తే ఉంటాం. ఈ సినిమా కూడా అలాంటి కంటెంట్ తోనే తెరకెక్కింది. ఈ సినిమాలో భర్త మీదున్న కోపంతో పక్కింటి కుర్రాడి పై భార్య ఆశలు పెంచుకుంటుంది.
భర్త ఆఫీస్ లో తన సెక్రెటరీతో ఎదో ఎఫైర్ పెట్టుకున్నాడని భార్య అనుమానిస్తోంది. ఆ కోపంతోనే పక్కింటి కుర్రాడిపై ఇష్టం పెంచుకుంటుంది. ఆ కుర్రాడు కూడా ఆమెకు కనెక్ట్ అవుతాడు. ఆ తర్వాత ఆమెకు అర్ధం అవుతుంది. తాను ఎంత పెద్ద తప్పు చేసిందో.. కానీ ఆ కుర్రాడు మాత్రం ఆమెకు బాగా కనెక్ట్ అవుతాడు. ఆమెతోనే ఉండాలని.. అతను చెప్పిందే చేయాలని.. ఆమె మీద అజమాయిషీ చేస్తాడు. కానీ ఆమె తన తప్పు తెలుసుకొని అతన్ని దూరం పెట్టాలనుకుంటుంది. కానీ అతను ఆమె మెయిల్ ను హ్యాక్ చేయడం, ఇద్దరూ కలిసున్న ఫోటోలను వర్క్ ప్లేస్ లో అంటించడం, వీటితో పాటు ఆమె భర్తను కొడుకును చంపుతానని బెదిరిస్తాడు. అయితే అతడి నుంచి ఆమె ఎలా బయటపడింది.? ఆ కుర్రాడు ఏం చేశాడు.? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా పేరు బాయ్ నెక్స్ట్ డోర్.. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఆకట్టుకుంటాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..