Nayanthara : నయనతార ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా ?.. లేడీ సూపర్ స్టార్ అన్నయ్య ఎవరంటే..

అయ్యా సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టిన నయన్.. ఆ తర్వాత తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో కలిపి మొత్తం 85కి పైగా సినిమాల్లో నటించింది. ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్ర కథానాయికగా దూసుకుపోతున్న హీరోయిన్లలో నయనతార ఒకరు. తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుని టాప్ హీరోయిన్‌గా ఎదిగి ఇప్పుడు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది. గ్లామర్ రోల్స్ కాకుండా కంటెంట్ ప్రాధాన్యతను చూస్తూ... నటిగా ఎప్పటికప్పుడు సరికొత్త కథలను.. విభిన్నమైన పాత్రలలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.

Nayanthara : నయనతార ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా ?.. లేడీ సూపర్ స్టార్ అన్నయ్య ఎవరంటే..
Nayanthara

Updated on: Feb 17, 2024 | 1:33 PM

సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‏గా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ నయనతార. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి…కెరీర్ తొలినాళ్లలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. కానీ తన నటన, ఆత్మవిశ్వాసంతో తనపై వస్తోన్న వ్యతిరేకతను తిప్పికొట్టింది. అయ్యా సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టిన నయన్.. ఆ తర్వాత తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో కలిపి మొత్తం 85కి పైగా సినిమాల్లో నటించింది. ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్ర కథానాయికగా దూసుకుపోతున్న హీరోయిన్లలో నయనతార ఒకరు. తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుని టాప్ హీరోయిన్‌గా ఎదిగి ఇప్పుడు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది. గ్లామర్ రోల్స్ కాకుండా కంటెంట్ ప్రాధాన్యతను చూస్తూ… నటిగా ఎప్పటికప్పుడు సరికొత్త కథలను.. విభిన్నమైన పాత్రలలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ జాబితాలో నయన్ ఒకరు.

గతేడాది జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన ఈ మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో అటు బీటౌన్ లోనూ ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి. అలాగే ఇటీవలే అన్నపూరణి సినిమాతో నటిగా మరో సాహసం చేసింది. థియేటర్లలో పర్వాలేదనిపించుకున్న ఈ మూవీ.. ఓటీటీలో మాత్రం వివాదాస్పదమైంది. చిత్రయూనిట్, దర్శకుడు, నయనతారపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అలాగే వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చేతిలో లేడీ ఒరియెంటెడ్ సినిమాలతో బిజీగా ఉంది నయన్. అలాగే షూటింగ్ నుంచి ఖాళీ సమయం దొరికితే తన కుమారుడు ఉయూర్, ఉలాగ్ తో గడిపేందుకు ప్రయత్నిస్తుంది. తన భర్త విఘ్నేశ్ శివన్‏, కుమారులు ఇద్దరితో కలిసి ఉన్న ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది నయన్.

అయితే పర్సనల్ విషయాలను అభిమానులతో ఎప్పుడూ పంచుకోదు నయన్. అగ్రకథానాయికగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కవలలు జన్మించారు. అయితే ఇప్పటికే నటి నయనతార తల్లి, తండ్రి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు నయనతార సోదరుడి ఫోటో ఒకటి నెట్టింట వైరలవుతుంది. నయన్ అన్నయ్య పేరు లేను అని తెలుస్తోంది. విఘ్నేష్, నయన్ అతడితో కలిసి సరదాగా ఉన్న ఫోటో ఇప్పుడు నెట్టింట వైరలవుతుండగా.. నయన్ సొంత అన్నయ్యా ? కదా? అనే విషయంపై మాత్రం స్పష్టత రావడం లేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.