Yash: బాక్సాఫీస్‌కు కింగ్ అయినా.. ఓ బిడ్డకు తండ్రేగా..! యష్ చేసిన పనికి నెటిజన్స్ ఫిదా
తెలుగు రాష్ట్రాల్లోనూ యష్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక సామాన్యుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన యష్ ఇప్పుడు సూపర్ స్టార్ గా ఎదిగాడు. కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా యష్ సింప్లిసిటీని నేటికీ మరిచిపోలేదు. యష్ చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు. అభిమానుల పట్ల ఆయన చూపించే ప్రేమ కూడా అలానే ఉంటుంది.

కన్నడ స్టార్ హీరో యష్ కు ఇప్పుడు ఇతరభాషల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. కేజీఎఫ్ సినిమా తర్వాత యష్ ను అభిమానించే వారి సంఖ్య పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ యష్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక సామాన్యుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన యష్ ఇప్పుడు సూపర్ స్టార్ గా ఎదిగాడు. కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా యష్ సింప్లిసిటీని నేటికీ మరిచిపోలేదు. యష్ చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడు. అభిమానుల పట్ల ఆయన చూపించే ప్రేమ కూడా అలానే ఉంటుంది. అలాగే యష్ ఓ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్. తన కుటుంబం కోసం కావాల్సినంత సమయాన్ని కేటాయిస్తుంటాడు. తాజాగా యష్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తాజాగా యష్ భార్యతో కలిసి కూతురిని భుజాల మీద ఎత్తుకుని జనం మధ్యకు వచ్చాడు. ఒక చిన్న షాపులో కూతురు కోసం చెక్లెట్ కొన్నాడు . దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కుటుంబంతో కలిసి బయటకు వెళ్లినప్పుడు. ఆయన కూతురు చాక్లెట్లు కావాలని అడగటంతో అక్కడే ఉన్న ఓ చిన్న దుకాణాన్ని వెళ్లి కూతురి కోసం చెక్లెట్ కొన్నాడు యష్. యశ్ దుకాణానికి వెళ్లినప్పుడు ఆయన భార్య రాధికా పండిట్ కూడా ఉన్నారు. ఆమె అక్కడ ఓ సాధారణ మహిళలా కూర్చున్న ఫోటో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
కష్టపడి ఎదిగిన నటుడు యష్‌కి నేడు చాలా భాషల్లో డిమాండ్ ఉంది. కానీ ఆయన చాలా సింపుల్ గా ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. యష్ కు పేదల కష్టాలు, పేదరికం గురించి బాగా తెలుసు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. యష్ చాలా మందికి సహాయం చేశాడు.. అందుకే ఆయనంటే జనానికి ఎనలేని అభిమానం అంటున్నారు ఫ్యాన్స్. కూతురి కోసం మామూలు తండ్రిలా ఓ చిన్న షాపుకి వచ్చిన యష్ ను చూసిన జనం ఆయనతో ఫోటో దిగడానికి ఎగబడ్డారు. యష్ ప్రస్తుతం ‘టాక్సిక్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు.
వైరల్ గా మారిన యష్ ఫోటోలు
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
