Mahesh Babu: మహేష్ ఇంటిని చూశారా ?.. హైదరాబాద్ నుంచి దుబాయ్ వరకు.. ఎన్ని ఉన్నాయంటే..

2000లో విడుదలైన వంశీ సినిమా సమయంలో ఏర్పడిన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. దాదాపు 5 ఏళ్లు ప్రేమలో ఉన్న వీరు.. 2005 ఫిబ్రవరి 10 ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు నమ్రత. వీరికి బాబు గౌతమ్, పాప సితార ఉన్నారు. నమ్రత ఫ్యామిలీ విషయాలు, బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఉండగా.. మహేష్ మాత్రం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Mahesh Babu: మహేష్ ఇంటిని చూశారా ?..  హైదరాబాద్ నుంచి దుబాయ్ వరకు.. ఎన్ని ఉన్నాయంటే..
Mahesh, Namratha

Updated on: Feb 12, 2024 | 1:14 PM

ఇటీవలే గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. సంక్రాంతి పండక్కి విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది ఈ మూవీ. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 10 నాటికి మహేష్, నమ్రత వివాహం జరిగి 19 ఏళ్లు పూర్తయ్యాయి. 2000లో విడుదలైన వంశీ సినిమా సమయంలో ఏర్పడిన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. దాదాపు 5 ఏళ్లు ప్రేమలో ఉన్న వీరు.. 2005 ఫిబ్రవరి 10 ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు నమ్రత. వీరికి బాబు గౌతమ్, పాప సితార ఉన్నారు. నమ్రత ఫ్యామిలీ విషయాలు, బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఉండగా.. మహేష్ మాత్రం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

మహేష్ బాబు నికర విలు సుమారు రూ. 273 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటివరకు వ్యాపార రంగంలో రాణిస్తున్న నమ్రత రూ. 50 కోట్ల వరకు సంపాదించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. మొత్తం రూ. 320 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హైదారాబాద్ నుంచి దుబాయ్ వరకు వీరికి అనేక ఇళ్లు ఉన్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.

హైదరాబాద్‌లోని ఎలైట్ జూబ్లీహిల్స్‌లో ఉన్న ఇళ్లు దాదాపు రూ. 28 కోట్లు ఉంటుందని సమాచారం. ఈ ఇంటికి సంబంధించిన ఫోటోస్ అనేకసార్లు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. భాగ్యనగరంలో కేవలం ఒకటి కాదు.. ఇంకా రెండు ఇళ్లు ఉన్నాయి.

అలాగే బెంగుళూరులోను ఒక ఇళ్లు ఉందట.. లైఫ్ స్టైల్ ఆసియా CNBC నివేదికల ప్రకారం, మహేష్ బాబు ఇటీవల నగరంలో ఒక ఇంటిని కొనుగోలు చేసాడు. దీనికి గురించి ఇంకా వివరాలు వెల్లడించలేదు.

ఖలీజ్ టైమ్స్ నివేదికల ప్రకారం గతేడాది ఏప్రిల్ లో దుబాయ్ లో సముద్ర తీరం వెంబడి ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీని గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

హైదరాబాద్‌లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లో ఉన్న ఏఎమ్‌బి సినిమాస్ మల్టీప్లెక్స్‌తో సినిమా యాజమాన్యంలోకి మహేష్ బాబు ప్రవేశించారు. 2018లో ప్రారంభించారు.

రోడ్ నెం.12లో బంజారాహిల్స్ లో ఉన్న AN ప్యాలెస్ హైట్స్ వీరిద్దరి అభిరుచికి నిదర్శనం. ఆసియన్ గ్రూప్స్ సహకారంతో దీనిని గతేడాది ప్రారంభించారు. ‘AN’ అంటే ‘ఆసియన్ నమ్రత.’

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.