16 సినిమాలు చేస్తే 7 హిట్స్.. పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా.?
సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది అందాల భామలు కొన్ని సినిమాలేక పరిమితం అవుతున్నారు. అందం, అభినయం ఉన్నప్పటికీ కొంతమంది భామలు నాలుగు ఐదు సినిమాలు చేసి ఆతర్వాత కనిపించకుండా పోతున్నారు. కొంతమంది ఇతరభాషల్లో బిజీ అవుతున్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు.. తెలుగులో ఈ చిన్నది 16 సినిమాలు చేసింది

ఆమె అందం చూస్తే ఫిదా కానీ కుర్రాడు ఉండడు. కోకిలలాంటి వాయిస్, కవ్వించే రూపం, ఆకట్టుకునే నటన ఈ ముద్దుగుమ్మ సొంతం. తన టాలెంట్ తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. మల్టీటాలెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా..? తెలుగులో ఈ అమ్మడు 16 సినిమాలు చేసింది. అన్ని ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో 16 సినిమాలు చేస్తే దాదాపు 7 సినిమాలు హిట్ గా నిలిచాయి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అమ్మడు. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ ప్రేక్షకులను అలరించింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ఇంతకూ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోల సరసన సినిమాలు చేసిన ఈ చిన్నది మరెవరో కాదు ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న నిత్యామీనన్. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అలా మొదలైంది సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది నిత్యా అంతకు ముందు తమిళ్ లో పాలు సినిమాలు చేసి మెప్పించింది.
ఇష్క్, ఒక్కడినే,జబర్దస్త్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఒక్క అమ్మాయి తప్ప,జనతా గ్యారేజ్, అ!, గీత గోవిందం,ఎన్.టి.ఆర్. కథానాయకుడు, నిన్నిలా నిన్నిలా,గమనం, స్కైలాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో మెప్పించింది నిత్యామీనన్. తెలుగులో చివరిగా భీమ్లానాయక్ సినిమాతో మెప్పించింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్యగా నటించింది నిత్యా. అలాగే పలు టీవీ షోల్లోనూ నటించింది. అలాగే తెలుగు ఇండియన్ ఐడల్ కు జడ్జ్ గా ను చేసింది. తిరుచిత్రంబలం సినిమాకు నేషనల్ అవార్డు కూడా అందుకుంది ఈ బ్యూటీ. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిత్యా.. తన ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








