
సోషల్ మీడియాలో హీరోయిన్స్ ఫోటోలకు కొదవే ఉండదు. హీరోయిన్స్ కు సంబందించిన చాలా ఫోటోలు నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటాయి. హీరోయిన్స్ రకరకాల ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. లేటెస్ట్ ఫోటో షూట్స్ నుంచి.. చిన్ననాటి ఫోటోల వరకు సోషల్ మీడియాలో దొరకని ఫోటో అంటూ ఉండదు. అలాగే ఇప్పుడు ఓ చిన్నన్నదని ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ను గుర్తుపట్టారా..? ఆ అమ్మడు ఇప్పుడు చాలా క్రేజ్ ఉన్న హీరోయిన్.. చిన్నప్పుడు స్కూల్ డ్రస్ లో క్యూట్ గా స్మైల్ ఇస్తున్న ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు తన అందచందాలతో కుర్రకారును కవ్విస్తుంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో చెప్పుకోండి చూద్దాం..! చాలా మంది గుర్తుపట్టలేకపోతున్నారు..
ఇంతకు పై ఫోటోలో స్కూల్ డ్రస్ లో ఉన్న ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో యమా క్రేజ్ ఉంది. ఇంతకు ఆ వయ్యారి భామ ఎవరో కాదు.. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ప్రియ భవానీ శంకర్. టీవీ రంగంనుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ చిన్నది. హీరోయిన్ గా మరి సినిమాలు చేస్తుంది. న్యూస్ రీడర్, సీరియల్స్ చేసింది.. ఆతర్వాత హీరోయిన్ గా మారింది. మేయాద మాన్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రియ భవానీ శంకర్.
జీవా, కార్తీ, ఎస్ జె సూర్య, అశోక్ సెల్వన్, ధనుష్ లాంటి స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది ఈ బ్యూటీ. సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన కళ్యాణం కమనీయం చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. నాగ చైతన్య నటించిన వెబ్ సిరీస్ దూతలో నటించింది ప్రియ. రీసెంట్ గా గోపీచంద్ హీరోగా నటించిన భీమాలో నటించింది. డీమాంటీ కాలనీ 2, రత్నం, ఇండియన్ 2 సినిమాలు చేస్తుంది ప్రియ భవానీ శంకర్. ప్రస్తుతం ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.