ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫొటోస్ లో సినిమా తరాలకు సంబంధించినవే.. హీరోయిన్స్ రకరకాల ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా పై ఫొటోలో కనిపిస్తున్న అమ్మడు ఫోటోలు కూడా తెగ వైరల్ అవువుతోంది. పై ఫొటోలో కనిపిస్తోన్న హీరోయిన్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతోంది. ఆమె ఎవరో గుర్తుపట్టారా..? తెలుగుతో పాటు తమిళ్ భాషలోనూ సినిమాలు చేస్తోంది.. ఇంతకు ఆమె ఎవరంటే..
ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు వరలక్ష్మీ శరత్ కుమార్. వర్సటైల్ నటుడు శరత్ కుమార్ కూతురే ఈ భామ. వరలక్ష్మీ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేస్తూ అలరిస్తోంది.
ముఖ్యంగా క్రాక్ సినిమా ఈ అమ్మడికి మంచి పేరుతెచ్చిపెట్టింది. వరలక్ష్మీ హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించింది. అయితే వరలక్ష్మికి సరైన గుర్తింపు తెచ్చింది మాత్రం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలే.. ముఖ్యంగా మన దగ్గర క్రాక్ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాలో వరలక్ష్మీ జయమ్మ అనే పాత్రలో కనిపించింది అలాగే రీసెంట్ గా వచ్చిన వీరసింహారెడ్డి సినిమాలోనూ నెగిటివ్ పాత్రలో కనిపించింది ఈ భామ.. ప్రస్తుతం తెలుగులో పలు సినిమాల్లో నటిస్తోంది.